నేటినుండి ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టే రాశులివే.. మొదలైన గజకేసరి రాజయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాలు నిర్దిష్ట కాలంలో రాశులను నక్షత్రాలను మారుతూ ఉంటాయి. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత వేగంగా కదిలే గ్రహమైన చంద్రుడు ఒకరాశిలో రెండున్నర రోజులపాటు ఉంటాడు. ఏదో ఒక గ్రహంతో సంబంధం కలిగి కొన్ని సార్లు శుభయోగాలను కొన్నిసార్లు అశుభయోగాలను చంద్రుడు సృష్టిస్తాడు.
గజకేసరి రాజయోగం
తాజాగా వృషభ రాశిలో ఉన్న గురుడితో చంద్రుడు నేడు సంయోగం జరిపి గజకేసరి రాజయోగాన్ని ఏర్పరచాడు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట 18 నిమిషాలకు చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఇక అప్పటికే అక్కడ ఉన్న గురుడు వృషభ రాశిలో కి ప్రవేశించిన చంద్రుడితో కలయిక జరిపి గజకేసరి రాజయోగాన్ని సృష్టించాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అపరిమిత ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభరాశి
నేడు ఏర్పడిన గజకేసరి రాజయోగం కారణంగా వృషభరాశి జాతకులకు అదృష్టం వచ్చి పడుతుంది. ఎప్పటినుండో వసూలు గాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతంగా మారుతుంది. వృషభ రాశి జాతకులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనూ పురోగతి సాధ్యమవుతుంది. వృషభ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్ని విషయాల్లోనూ వృషభరాశి జాతకులు మంచి ఫలితాలను సాధిస్తారు.
కన్యారాశి
గజకేసరి రాజయోగం కారణంగా నేటి నుండి కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేసిన పనికి ప్రశంసలను పొందుతారు. జీవితంలో ఉండే సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. చేసే ప్రతి పనిలోనూ కుటుంబ మద్దతు లభిస్తుంది.
వృశ్చిక రాశి
గజకేసరి రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణ ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితులు బలోపేతంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు జీవితంలో విశేషమైన మార్పులను చూస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications