కార్తీక మాసమంతా కనకవర్షం ఈ రాశులకే సొంతం!

కార్తీక మాసం ప్రారంభమైంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీకమాసంలో శివ, కేశవులను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. శివుడికి, విష్ణుమూర్తికి ప్రత్యేకంగా చెప్పే ఈ కార్తీకమాసం నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహిస్తారు.

కార్తీకమాసంలో అదృష్టరాశులు
ఇటు శైవ క్షేత్రాలు, అటు వైష్ణవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడతాయి. కార్తీకమాసంలో దానధర్మాలు, వ్రతాలు, జపాలు ఇలా అందరూ భక్తిలో మునిగిపోతారు. అయితే కార్తీకమాసంలో చేసే పనులు మనకి శుభాలను చేకూరుస్తాయని చెబుతారు. అయితే కార్తీకమాసంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

These zodiac signs will get wealth and happy life in karthika masam and karthika pournami

కర్కాటక రాశి
కార్తీక మాసంలో కర్కాటక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కార్తీకమాసంలో శివయ్య ఆశీర్వాదం వల్ల కర్కాటక రాశి జాతకులకు ఆదాయం సమకూర్తుంది. ఈ సమయంలో కోర్టు కేసులలో విజయాన్ని సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సంతోషంగా జీవిస్తారు. ఈ మాసంలో కర్కాటక రాశి జాతకులు అనుకున్న పనులన్నీ విజయవంతమవుతాయి.

తులారాశి
కార్తీక మాసంలో తులా రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే తులా రాశి వారికి ఇప్పుడు విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. సోదరుల నుండి డబ్బు సహాయాన్ని పొందుతారు. ఇది తులా రాశి జాతకులకు మంచి ఆదాయాన్ని ఇచ్చే కాలం. తులారాశి జాతకులు కార్తీక మాసం అంతా ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు.

కుంభరాశి
కుంభ రాశి జాతకులకు కార్తీకమాసం అదృష్టాన్ని ఇస్తుంది. శివయ్య దయవల్ల కుంభరాశి జాతకులు ఈ నెల రోజులు ఏ పని చేసినా సత్ఫలితాలు వస్తాయి. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఊహించని విధంగా ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. భార్య తరపు వారి నుండి ఆస్తి లాభం కలుగుతుంది. నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+