కొన్ని గంటల్లో శుక్ర శని సంయోగంతో వీరి పంట పండుతుంది!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నిర్దిష్ట సమయం ప్రకారం అన్ని గ్రహాలు వివిధ రాశులను, నక్షత్రాలను మార్చుతూ సంచారం సాగిస్తూ ఉంటాయి. ఇక ఈ సంచార ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన పడుతుంది. అయితే గ్రహాల సంచారం తో పాటు, వివిధ గ్రహాల కలయిక కూడా రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఒకే రాశిలో రెండు నుంచి మూడు గ్రహాలు కలవడం వల్ల అనేక యోగాలు ఏర్పడుతున్నాయి.
శుక్ర శని సంయోగం
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని విలాసాలకు అధిపతిగా చెబుతారు. ఇక శని గ్రహాన్ని కర్మ ఫలితాలను ఇచ్చే దేవుడిగా చెబుతారు. అటువంటి శుక్రుడు, శని కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి శుభాలు రాబోతున్నాయి. ఏప్రిల్ 25వ తేదీన శుక్రుడు, శని సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభరాశి
వృషభ రాశి వారికి శని శుక్రుల సంయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. వీరికి వృత్తిపరమైన జీవితంలో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఎప్పటి నుండో వసూలు కాని మొండి బాకీలు ఈ సమయంలో వసూలు అవుతాయి.
తులారాశి
తులారాశి వారికి శుక్ర శని సంయోగం కారణంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీరికి కెరీర్ పరంగా ఈ సమయంలో బాగుంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. తండ్రి సహాయంతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. వాహన యోగం ఉంది.
కుంభరాశి
శుక్ర శని గ్రహాల కలయిక వలన కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుంభ రాశి వారికి కెరీర్లో సానుకూల మార్పులు వస్తాయి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. మానసిక సమస్యలు దూరమవుతాయి. ఎలాంటి పని అయినా ఈజీగా చేసి మంచి ఫలితాలను పొందుతారు.
మకరరాశి
శుక్ర శని గ్రహాల కలయిక వల్ల మకర రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. శుక్రుడి అనుగ్రహం వల్ల వీరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. జీవన ప్రమాణాలలో మెరుగుదల కనిపిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications