దీపావళి నాడు త్రిగ్రాహి యోగంతో వీరికి నిత్య కళ్యాణం, పచ్చ తోరణం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. అక్టోబర్ మాసంలో దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండుగ నాడు అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. దీపావళి పండుగ నాడు అత్యంత శక్తివంతంగా భావించే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, బుధుడు మరియు కుజుడు మూడు గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
దీపావళి నాడు త్రిగ్రాహి యోగం
దీపావళి నాడు ఏర్పడే త్రిగ్రాహి యోగంతో ఆయా రాశుల వారికి ఊహించని ఆర్థిక లాభాలు మరియు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశులవారికి అన్ని విధాలా శుభ దాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది. ఆ రాశులు ఏమిటో మనం ప్రస్తుతం తెలుసుకుందాం.

తులారాశి
త్రిగ్రాహి యోగం కారణంగా తులా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ యోగం ఈ రాశి వారి లగ్న గృహంలో ఏర్పడుతుంది. అందువల్ల ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. కృషికి తగిన ప్రశంసలు దొరుకుతాయి. ఈ సమయంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మకర రాశి
దీపావళి నాడు ఏర్పడే త్రిగ్రాహి యోగం కారణంగా మకరరాశి జాతకులు అదృష్టజాతకులు అవుతున్నారు. త్రిగ్రాహియోగం వీరికి ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూపిస్తుంది. ఈ యోగం వీరి కర్మగృహంలో ఏర్పడుతుంది. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. వేగవంతమైన కెరీర్ పురోగతికి అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయాలు వరిస్తాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు కోరుకున్న స్థానానికి బదిలీ అవుతారు. ఈ సమయంలో తండ్రితో సంబంధం బలపడుతుంది.
ధనుస్సు రాశి
త్రిగ్రాహి యోగం వీరికి కలిసివస్తుంది.ఈ యోగం వీరి ఆదాయ మరియు లాభ గృహంలో ఏర్పడుతుంది. ధనస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూస్తారు. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ప్రతిపాదనలను అందుకుంటారు. మీరు పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందుతారు. స్టాక్ మార్కెట్స్ స్పెక్యులేషన్ మరియు లాటరీ అవకాశాల నుండి కూడా ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఉద్భవించవచ్చు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications