కొత్త సంవత్సరంలో నక్కతోక తొక్కే రాశులవారు వీరే.. మీరున్నారా?
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహువును చెడు చేసే గ్రహంగా, క్రూర గ్రహంగా భావిస్తారు. రాహు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన స్థానం ఉంది. రాహువు ఎవరి జాతకంలోనైనా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, మంచి స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా మంచి కూడా చేస్తాడు. నీచ స్థానంలో ఉంటే అంతే కఠినంగా ప్రవర్తిస్తాడు.
2025లో రాహు సంచారం
రాహువు, కేతువులు ఎప్పుడూ తిరోగమనములో సంచారం చేస్తారు. ప్రస్తుతం రాహువు బృహస్పతి పాలించే మీన రాశిలో ఉన్నాడు . రాహువు 2025 మే 18 వ తేదీన కుంభరాశి లోకి ప్రవేశించబోతున్నాడు. కుంభరాశిలోకి రాహువు సంచారం కూడా తిరోగామనంలోనే సాగుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి రాహువు సంచారం కారణంగా అన్నీ శుభాలే చేకూరుతాయి. ఈ సమయంలో మేష రాశి జాతకులు ఏ పని చేసినా మంచి ఫలితం వస్తుంది. మేష రాశి జాతకులు అసంపూర్ణంగా ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వర్తక వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నవారి సమస్యలు పరిష్కారమై వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.
కన్యారాశి
రాహువు 2025లో కుంభ రాశిలో సంచారం చేయటం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. 2025 సంవత్సరంలో కన్యా రాశి జాతకులు చాలా అద్భుతమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. ఉద్యోగాలు చేసే వారికి కూడా ప్రత్యేకమైన ఆఫర్స్ లభిస్తాయి. ఈ సమయం విద్యార్థులకు కూడా బాగా కలిసొస్తుంది. వీరి జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఈ ఈ సమయంలో పరిష్కరిస్తారు.
ధనస్సు రాశి
2025 సంవత్సరంలో ధనుస్సు రాశి వారు రాహువు కారణంగా అదృష్ట జాతకులు అవుతున్నారు. కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల వీరికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మీరు చేసే పనుల్లో విజయాలను సాధిస్తారు. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం. ఈ సమయంలో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications