రాశిని మార్చనున్న బుధుడు... కీలక మలుపు తిరగనున్న ఈ రాశుల జీవితాలు
గ్రహాల రాకుమారుడైన బుధుడు వారం రోజుల్లో తన రాశిని మార్చనున్నాడు. ఫిబ్రవరి 20న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అదే రాశిలో సూర్యుడు, శని సంచరిస్తుంటారు. బుధుడు సూర్యుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తాడు. అలాగే బుధుడు, శని కలయిక కూడా జరుగుతుంది. ఇలా బుధుడి సంచారంవల్ల ఏయే రాశులవారు విశేషమైన ప్రయోజనాన్ని పొందనున్నారో తెలుసుకుందాం.
మిథునరాశి
వీరికి విజయం దక్కుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కెరీర్ లో ఎదుగుదలతోపాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది.

మేష రాశి
వీరి కెరీర్ చాలా బాగుంటుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి కలుస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి.
వృషభరాశి
బుధుడి సంచారంవల్ల ఈ రాశివారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. కోరికలన్నీ నెరవేరతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. దారిద్ర్య స్థితి నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications