త్వరలో మాలవ్య రాజయోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
శుక్రుడు జనవరి 28వ తేదీన మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా వివిధ రాశుల వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలను పెంచుతుంది. ఇక మాలవ్య రాజయోగంతో లబ్ధిని పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభరాశి
శుక్రుడు పాలించే వృషభ రాశి వారికి శుక్ర సంచారం కారణంగా ఏర్పడే మాలవ్య రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసిన విజయం వరిస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. వివాహం కాని వారికి పెళ్లి అయ్యే అవకాశం ఉంది. అంతేకాక సమాజంలో ఉన్నత వర్గాలతో సత్సంబంధాలు వృద్ధి చెందుతాయి.

కర్కాటక రాశి
మాలవ్య రాజయోగం కర్కాటక రాశి జాతకులను అదృష్ట జాతకులు గా మారుస్తుంది. ఈ సమయంలో వీరు సృజనాత్మకమైన రంగాలలో అవకాశాలను పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా పురోగతిని సాధిస్తారు. ఇది కర్కాటక రాశి వారికి అన్ని విధాలా మేలు చేస్తుంది.
తులారాశి
మాలవ్య రాజయోగం తులా రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. శుక్రుడు తులా రాశిని పాలించే గ్రహం కావడంతో ఈ సమయంలో తులా రాశి వారు మాలవ్య రాజయోగంతో అపారమైన ప్రయోజనాలను పొందుతారు. తులా రాశి వారి సామాజిక స్థితి మెరుగుపడుతుంది. సృజనాత్మక రంగాల వారికి కూడా ఇది అంచి సమయం. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఆర్థికంగాను బలోపేతం అవుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మాలవ్య రాజయోగం ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ప్రేమా మరియు సంపద రంగాలలో శుక్రుని ప్రభావం కారణంగా ప్రయోజనాలను పొందుతారు. ఇది వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి మాలవ్య రాజయోగం కారణంగా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. సృజనాత్మక రంగాలలో పనిచేసే మకర రాశి వారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇది మకర రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే కాలం.
మీన రాశి
మాలవ్య రాజయోగం మీనరాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీన రాశి వారు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది. ఈ సమయంలో మీన రాశి వారి సంబంధాలు బలోపేతం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో మీనరాశి వారు అనుకున్నవన్నీ సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications