కర్కాటకంలో శుక్రుడు.. ఈ రాశులకు ఐశ్వర్యం, సంపద

వైభవానికి, సంపదకు, ఐశ్వర్యానికి సూచిక శుక్రుడు. ఎవరి జీవితంలో కుజుడు శుభస్థానంలో ఉంటాడో వారికి సంపదకు ఎటువంటి లోటు ఏర్పడదు. ఈనెల ఏడోతేదీన శుక్రుడు చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించాడు. ఈనెల 31వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. అనంతరం సింహరాశిలోకి ప్రవేశించి వచ్చే నెల 25వ తేదీ వరకు సంచారం చేస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి బాగా కలిసి రానుందని, ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

మేషం, వృషభం
వీరు గతంలో ఎన్నడూ పొందని ప్రయోజనాలను పొందడమే కాకుండా కెరీర్ కు సంబంధించిన ప్రతి పనిలో సులువుగా విజయాలు దక్కించుకుంటారు. అనేక శుభవార్తలను వింటారు. ఏ పనిలోకి ప్రవేశించినా విజయవంతమవుతారు. వీరికి వాహన సౌకర్యం సమకూరుతుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలున్నాయి. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని భార్యాభర్తలిద్దరూ చవిచూస్తారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులున్నీ కలిసిరావడంతోపాటు భవిష్యత్తులో మంచి రాబడులను అందిస్తాయి. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. విదేశాల్లో విద్యానార్జించాలనుకునేవారు ప్రయత్నాలు గట్టిగా చేస్తే కలిసివస్తాయి.

these zodiac sings very lucky due to Venus Transit 2024 July

కన్యారాశి, తులారాశి
వీరికి అనేక లాభాలున్నాయి. గతంలో ఎవరికైతే డబ్బులిచ్చి అవి నిలిచిపోయాయో అవి తిరిగి వస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంపదలో మార్పులు చోటుచేసుకుంటాయి. పూర్వీకుల నుంచి ఆస్తి రావడంతో ఆర్థికంగా బలోపేతమవుతారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. జీవితం మొత్తం ఆనందంగా సాగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు లేదంటే విహార యాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. పిల్లల విషయంలో మంకు పట్టు పట్టవద్దు. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. ఎట్టి పరిస్థితుల్లోను డబ్బులను పరాయివారికి అప్పుగా ఇవ్వొద్దు. మీకున్న రుణభారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి.

కర్కాటకం, సింహరాశి
వీరికి ధనలాభం ఉంది. అంతా శుభప్రదంగా గడుస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. కార్యాలయాల్లో పనులు వెంటనే జరుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. ఆదాయం ఊహించనిరీతిలో పెరగబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+