ఈ రాశులకు ఖర్చులు, నష్టాలు మోసుకొస్తున్న బృహస్పతి

వ్యక్తి జాతకంలో ఏ గ్రహం అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా గురువు అనుకూలంగా ఉంటే చాలు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. జీవితంలోని అన్ని కీలక పరిణామాలకు కారకుడయ్యే బృహస్పతి రాశి సంచారం చేసే సమయంలో కొన్ని రాశులకు మంచి, మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు కలుగుతాయి. ఈనెల 20వ తేదీన గురువు మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. కుజుడు అధిపతిగా ఉండే ఈ రాశిలోకి గురువు కొందరికి అపరిమితమైన లాభాలను కలిగిస్తున్నాడు. మరికొందరిపై మాత్రం తీవ్ర ఒత్తిడి పడుతోంది. నవంబర్ 28 వరకు బృహస్పతి ఈ రాశిలోనే సంచరిస్తుంటాడు.

తులారాశి
వీరిలో ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు సంబంధిత విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆర్థికంగా బలహీనపడతారు. కుటుంబం నుంచి మద్దతు లేక పలు సమస్యలను ఎదుర్కొంటారు. మితిమీరిన ఖర్చులను నియంత్రించలేరు. జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వీటన్నింటివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సాధ్యమైనంతవరకు ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతుండాలి. గురువును ఆశ్రయించి కష్టాల నుంచి బయటపడాలి.

these zodiac sings will face somany problems due to Brihaspati transit in mrigashira nakshatra

వృషభ రాశి
ఉద్యోగస్తులకు వారి వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి అసంతృప్తి ఎదురవుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. కష్టపడి పనిచేసినప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేరు. గురువు మృగశిరలోకి రావడంవల్ల ఈ రాశివారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. మీకు సమీపంలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించి కష్టాల నుంచి బయటపడేయమని వేడుకోవడం వల్ల మంచి జరుగుతుంది.

కుంభ రాశి
ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోకుండా ఉండటమే ఉత్తమం. ఉద్యోగస్తులకు ఈ సమయం ఏమాత్రం అనుకూలంగా ఉండదు. ఏవిధంగా కలిసిరాదు. ఈ సమయంలో ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా ఉండటం మంచిది. లేదంటే తీవ్రంగా నష్టపోతారు. ఈ సమయంలో ఈ రాశివారికి మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త లేకపోతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి మాటలను పట్టించుకోకుండా ఉంటే ఎంతో మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+