2026లో ఈ రాశులవారికి ఏలినాటి శని, అష్టమ, అర్దాష్టమ శనితో అగ్ని పరీక్షే
వేద జ్యోతిషశాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శని కర్మ, న్యాయానికి, క్రమశిక్షణకు అధిపతిగా చెప్పే దేవుడు. అటువంటి శనిదేవుడు ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనం నుండి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. 2026 సంవత్సరంలో కూడా మీన రాశి లోనే శని సంచారం కొనసాగుతుంది.
2026లో శనితో కష్టాలు వీరికే
2026 లో శని ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కారణంగా కొన్ని రాశుల జీవితాలలో ఊహించని కష్టాలను తీసుకురాబోతున్నాడు. జూన్ 2027 వరకు మీన రాశి లోనే సంచరించే శని దేవుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లతో ఏ రాశుల వారి జీవితాలలో అగ్నిపరీక్ష పెట్టబోతున్నాడో ప్రస్తుతం తెలుసుకుందాం.

కుంభరాశి
కుంభ రాశిలో ఏలినాటి శని చివరి దశలో ఉంది. 2026లో శని ఈ రాశిలో రెండవ ఇంట్లో ఉంటాడు. అదనంగా శని ఏలినాటి శని చివరి దశను అనుభవిస్తాడు. ఫలితంగా కుంభ రాశిలో జన్మించిన వారు కష్ట కాలాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సంవత్సరం మీకు మానసిక ఒత్తిడి కనిపిస్తుంది. చిన్న పనులకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం వస్తుంది.
మీనరాశి
మీన రాశిలో ఏలినాటి శని రెండవ దశలో ఉంటుంది. ఈ రాశిలోని లగ్న గృహంలో శని స్థానం ఉండడం వల్ల శని మీన రాశి వారికి బాధలను కలిగిస్తాడు. ఈ సమయంలో మీన రాశి వారు ప్రతికూల ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీ శత్రువులు మీపై పై చేయి సాధిస్తారు. పనిలో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.
మేషరాశి
మేషరాశిలో ఏలినాటి శని మొదటి దశలో ఉంది. మేష రాశి జాతకులకు 2026 సంవత్సరం కష్టాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మార్పులను చూస్తారు. కుటుంబంలో శాంతి, ఆనందం కోల్పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా మేషరాశి వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు.
సింహరాశి
సింహరాశి జాతకులు అష్టమ శనిని ఎదుర్కొంటున్నారు. 2026లో శని ఈ రాశిలో ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల సింహ రాశి వారు అనవసరమైన ఖర్చులతో ఇబ్బంది పడతారు. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి .మానసిక, శారీరక అనారోగ్యాన్ని అనుభవించే ప్రమాదముంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శనితో సమస్యలను ఎదుర్కొంటున్నారు. 2026 సంవత్సరంలో శని ఈ రాశిలో నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల ధనుస్సు రాశి వారికి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. ఆస్తికి సంబంధించిన వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటారు.












Click it and Unblock the Notifications