రాబోయే 22 రోజులు వీరే మహర్జాతకులు
సూర్యుడు ఈనెల 17వ తేదీన తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచరించింది. ఈ కారణంగా కొన్ని రాశులవారికి 22 రోజులపాటు సూర్యుడి అనుగ్రహం లభించనుంది. కొన్ని రాశులవారికి అదృష్టం తోడుగా నిలవనుంది. ఎవరెవరికి ఏ విధంగా కలిసిరానుందో, 22 రోజులపాటు ఎవరెవరు మహర్జాతకులుగా మారనున్నారో తెలుసుకుందాం.
మిథున రాశి : సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధైర్యం పెరిగి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు పెట్టుబడులవల్ల లాభాలున్నాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది.

కర్కాటక రాశి : సమాజంలో పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు శుభవార్తలు వింటారు. ఊహించని లాభాలున్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. విద్యారంగంలో కొనసాగుతున్నవారికి ఊహించనిరీతిలో లాభాలున్నాయి.
కన్యా రాశి : ధైర్యం పెరగడంవల్ల ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. వైవాహిక జీవితం గడుపుతున్నవారు సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ఊహించనిరీతిలో లాభాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పదవీ ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టబడానికి ఇది మంచి సమయం.












Click it and Unblock the Notifications