సెప్టెంబర్ లో వీరికి జాక్ పాట్ తగులుతుంది.. మీ రాశి ఉందా?
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ మాసంలో అనేక ఖగోళ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. సెప్టెంబర్ మాసంలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు వివిధ రాశుల్లోకి మార్పు చెందుతారు. కుజుడు తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. 2 సార్లు నక్షత్ర మార్పు చేస్తాడు.
సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం
ఇక సూర్యుడు, బుధుడు కలిసి సెప్టెంబర్ మాసంలో బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు. సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు రాశిని మారుస్తాడు.సెప్టెంబర్ మాసంలో శుక్రుడు రెండు సార్లు రాశిని మార్పు చేస్తాడు. రెండుసార్లు నక్షత్రాన్ని కూడా మారుస్తాడు. ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మేషరాశి
మేష రాశి వారికి సెప్టెంబర్ మాసంలో సానుకూల ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి . ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో పెళ్ళికాని వారికి వివాహాలకు ఛాన్స్ ఉంది. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఈ సమయం ఆర్థికంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది.
వృషభ రాశి
సెప్టెంబర్ మాసం వృషభ రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి సంతోషం ఉంటుంది. వృషభ రాశి వారు విలాసవంతమైన వస్తువులను కొంటారు. వీరి కెరీర్ బాగుంటుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆదాయం పెరుగుతుంది
వృశ్చిక రాశి
సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారికి అన్ని విధాల బాగుంటుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. ప్రమోషన్లు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి జాతకుల దాంపత్య జీవితం బాగుంటుంది.
కుంభరాశి
సెప్టెంబర్ మాసం కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఇష్టమైన ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. ఉద్యోగం చేసే వారికి బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications