రాసి పెట్టుకోండి.. ఈ నక్షత్రాలలో పుట్టినవారు జీవితాంతం కుబేరులే!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు పుట్టిన నక్షత్రం కూడా వివిధ జాతకుల జీవితాన్ని నిర్ణయిస్తుంది. కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారు వారి పుట్టిన నక్షత్రాన్ని బట్టి కొందరు సానుకూల ఫలితాలను, కొందరు ప్రతికూల ఫలితాలను పొందుతారు. కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి ఆర్థిక పరిస్థితి జీవితాంతం లోటు లేకుండా, తిరుగులేకుండా సాగిపోతుంది. వారంతా పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉంటారు.

సంపన్నులుగా చేసే అదృష్ట నక్షత్రాలు
ఎవరైనా సరే పుట్టిన సమయాన్ని బట్టి ఆ సమయంలో ఉన్న నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా భావిస్తాం. ఆ విధంగా చూస్తే వారి జన్మ నక్షత్రం ఆధారంగా కూడా వారి జీవితం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారికి అదృష్టం మామూలుగా ఉండదు. వారు అన్ని విధాల ఆర్థిక ప్రయోజనాలను పొందటమే కాకుండా జీవితాంతం సంపన్నులు గానే ఉంటారు. మరి ఆ అదృష్ట నక్షత్రాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Those born under these stars are very rich and life long millionires

అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు ఏ రంగంలోనైనా ఒక వెలుగు వెలుగుతారు. వీరు చిన్నప్పటి నుంచే సంపన్నులుగా ఉంటారు. సాధారణంగా తెలివితేటలు, ధైర్య సాహసాలు కలిగిన వారుగా ఉంటారు. సొంత ఆలోచనలతో జీవితాంతం వీరు గొప్పగా జీవిస్తారు.

భరణి నక్షత్రం
భరణి నక్షత్రంలో పుట్టిన వారు జీవితాంతం ధనవంతులుగా ఉంటారు. వీరు స్థిరాస్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కావడంతో వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అందాన్ని ఆరాధించేవారుగాను, ఆనందాన్ని కోరుకునే వారిగాను, కళా పోషకులుగాను వీరు జీవిస్తారు.

కృత్తికా నక్షత్రం
కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా విద్యావంతులుగా ఉంటారు. వీరి జీవితకాలమంతా ధనవంతులుగానే జీవిస్తారు. వీరు ఆరోగ్యంగానూ, నిజాయితీగాను, ప్రకాశవంతంగానూ ఉంటారు. డబ్బుకు లోటు లేకుండా వీరి జీవితం సాగిపోతుంది.

మఖా నక్షత్రం
మఖా నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు మెరుగ్గా ఉంటాయి. మీరంతా నైతికతను కలిగి ఉంటారు. జీవితాంతం సంపద, అదృష్టాన్ని కలిగి ఉన్నవారుగా ఉంటారు. వీరి అదృష్టం కారణంగా వీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు.

పూర్వ ఫాల్గుణి నక్షత్రం
పూర్వఫాల్గుణి నక్షత్రంలో జన్మించిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అందంగాను సమర్థులుగాను ఉంటారు. చక్కగా మాట్లాడటం లోను, ఇతరులతో పని చేయించడంలోనూ, ఇతరులతో సన్నిహితంగా మెలగడంలోనూ నైపుణ్యాన్ని కనబరుస్తారు. స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. కళల పట్ల ఆసక్తి ఉంటుంది. విలాసాలను ఇష్టపడతారు.

ఉత్తర ఫాల్గుణి నక్షత్రం
ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో పుట్టిన వారు ఏ రంగంలోనైనా విజయం సాధించగలిగిన వారిగా ఉంటారు. వీరు పుట్టుక నుండే సంపన్నులుగా జీవిస్తారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉండగలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులైన సానుకూలంగా మార్చే నైపుణ్యం వీరిలో ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+