మీనరాశిలో రాహువు.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే!
గ్రహాల్లో ముఖ్యమైన రాహు, కేతువులను ఛాయా గ్రహాలని పిలుస్తారు. ఇవి నిత్యం 180 డిగ్రీల కోణంలో తిరుగుతుంటాయి. అన్ని గ్రహాలు సవ్య దిశలో పయనిస్తే.. ఈ రెండు గ్రహాలు మాత్రం అపసవ్య దిశలో పయనిస్తాయి. గతేడాది అక్టోబరు 30వ తేదీ నుంచి రాహువు మీన రాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి ఆర్థికంగా లాభాలతోపాటు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
తుల రాశి
ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న డబ్బులు వీరిచేతికి అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. తమ భవిష్యత్తునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే సందర్భం ఎదురవుతుంది. అయితే భయం లేకుండా నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతోపాటు సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. బంధుమిత్రులతో మంచి సంబంధాలు కలుగుతాయి.

మిథున రాశి
ఉద్యోగంలో ప్రమోషన్ తోపాటు వ్యాపారంలో మంచి వృద్ధి ఉంది. ధన లాభం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న విజయాలు చేతికి అందుతాయి. కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. కొత్త పనిని ప్రారంభించడానికి ఇది మంచి తరుణం.. దీన్ని వదులుకోవద్దు.
కుంభ రాశి
రాహువు సంచారం వీరికి అపారమైన ధనయోగాన్ని అందివ్వనుంది. ఈ ఏడాది మొత్తం వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. జీవితంలో స్థిరత్వం కలుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. వ్యాపారస్తులకు మంచి సమయం. కుటుంబ సభ్యులతోపాటు బంధు మిత్రులతో ఎక్కువ సమయం గడుపుతారు.












Click it and Unblock the Notifications