సెప్టెంబర్ నుండి మూడు రాశుల దశ తిరుగుతోంది.. చెక్ చేసుకోండి!
వేద జ్యోతిష్య శాస్త్రంలో సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకు రాబోతోంది. సెప్టెంబర్ మాసంలో మిత్ర గ్రహాలైన బుధుడు, సూర్యుడు కన్య రాశిలో సంచరిస్తారు. బుధుడు కమ్యూనికేషన్ కు, వ్యాపారాలకు, తెలివితేటలకు కారకుడు. సూర్య భగవానుడు ఆత్మవిశ్వాసానికి, గౌరవానికి, పరిపాలనకు కారకుడు.
కన్యారాశిలో బుధ సూర్యులు.. అదృష్ట రాశులు
మిత్ర గ్రహాలుగా సఖ్యంగా ఉండే ఈ రెండు గ్రహాలు కన్యా రాశిలో సంచారం చేయటం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారి దశ తిరుగుతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అసలు బుధ సూర్యుల సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
సెప్టెంబర్ మాసంలో బుధుడు మరియు సూర్యుడు సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు కలిసివస్తుంది. వీరు భౌతిక సుఖాలను పొందుతారు. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి నుండి లాభాలు పొందుతారు. ఈ రెండు గ్రహాల సంచారంతో ఈ సమయంలో మీరు ఏ పని చేసినా పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.
ధనుస్సు రాశి
సెప్టెంబర్ మాసంలో బుధుడు మరియు సూర్యుడు కన్యారాశిలో సంచరించడం వల్ల ధనుస్సు రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. బుధుడు మీ జాతక సంచారంలో పదవ ఇంట్లో సంచరించడం వల్ల ఏ పని చేసిన విజయం సాధిస్తారు.వ్యాపారాలు చేసేవారికి ఎక్కువ లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. పనిచేసే చోట మీ నాయకత్వం, నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందవచ్చు. తండ్రితో మీ సంబంధం బలపడుతుంది.
కన్యారాశి
సెప్టెంబర్ మాసంలో బుధ, సూర్యులు కన్యా రాశిలో సంచారం చేయడం వల్ల కన్య రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ రాశి చక్రంలో లగ్న గృహంలో బుధ సూర్యుల సంచారం జరుగుతుంది. ఈ సమయంలో వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక బంధం బలోపేతం అవుతుంది. అవివాహితులకు మంచి సంబంధాలు వస్తాయి. సహోద్యోగులతో సమన్వయం బాగుంటుంది. విద్యార్థులు ఈ సమయంలో రాణిస్తారు . సామాజికంగా పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications