హోలీకి ముందు శని సంచారం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడు న్యాయదేవత. జాతకంలో శని శుభస్థానంలో ఉంటే శ్రేయస్సుకు, ఆనందానికి ఎటువంటి ఢోకా ఉండదు. అశుభ స్థానంలో ఉంటే పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈనెల 18వ తేదీన శని కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల ఏయే రాశులవారికి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
తులా రాశి
ఏళ్ల తరబడి పెండింగ్ లో నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వృత్తిపరమైన జీవితంలో గడుపుతున్నవారికి మాత్రం మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతలున్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది.

ధనుస్సు రాశి:
ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి వారి వారి యాజమాన్యం నుంచి లాభాలు పొందుతారు. అలాగే తోటి ఉద్యోగుల నుంచి కూడా ప్రయోజనాలు అందుతాయి. కెరీర్ కు సంబంధించిన పనుల్లో మంచి ప్రయోజనం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి.
వృషభ రాశి
ఈ రాశివారికి మంచి ప్రయోజనాలున్నాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే ఊహించని ధనలాభం కూడా ఉంది. మనసు సంతోషంగా ఉంటుంది. ఇతరుల నుంచి శుభవార్తలను వింటారు. కష్టపడి పనిచేయడంవల్ల లాభాలను ఆర్జిస్తారు.












Click it and Unblock the Notifications