ఈ రాశులకు తెలియకుండానే కోటీశ్వరులను చేస్తోన్న సర్వార్ధ సిద్ధి యోగం
జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు అనుకూల పరిణామాలు ఎదురైతే, మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ఈనెల 16వ తేదీ జ్యోతిష్యం ప్రకారం అత్యంత కీలకమైనది. ఆరోజు చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశించడంతోపాటు బృహస్పతితో సంచారం చేసి గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. తిరిగి 18వ తేదీన అమృత సిద్ధి, సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలన్నీ ఎంతో శక్తివంతమైన యోగాలు. వీటివల్ల లాభపడే రాశుల వివరాలు తెలుసుకుందాం.
కర్కాటకరాశి
పెద్దల నుంచి మద్దతు లభించి అనుకున్న పనులు పూర్తిచేయబోతున్నారు. కెరీర్ పరంగా మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. ఊహించనిరీతిలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులు లభించడంతోపాటు ప్రమోషన్స్ కూడా ఉద్యోగస్తులకు వస్తాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

ధనుస్సు రాశి
సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగంవల్ల ఈ రాశివారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ సమయంలో వీరు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతారు. అంతేకాదు.. కొంతకాలం నుంచి ఆర్థికంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.
వృభష రాశి
వృత్తిపరమైన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. లాభాలను ఆర్జిస్తారు. ఈ యోగాల ప్రభావంవల్ల కొందరికి అనుకూలగా, మరికొందరికి ప్రతికూలంగా పరిణామాలు ఎదురవుతున్నాయి. ప్రతికూలంగా ఎదురవడానికి వారు చేసుకున్న కర్మలే కారణం. కార్తీకమాసం కాబట్టి శివుణ్ని పూజించడంవల్ల, శనిదేవుణ్ని పూజించడంవల్ల కర్మల బలం తగ్గుతుంది. ఇలా తగ్గడానికి గురువును సేవించాలి. గురుబలం ఉండటంవల్ల ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న గొడవలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది.












Click it and Unblock the Notifications