అరుదైన అవకాశం ఇస్తున్న శని... ఏప్రిల్ నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
ఖగోళంలో సంచరించే నవగ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు న్యాయదేవత. మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తుంటాడు. మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే అంతకు రెట్టింపు.. ఆయన నీతి, నిజాయితీకి ప్రతిరూపం. శనిదేవుడు అనుగ్రహిస్తే ఆ జీవితానికి తిరుగే ఉండదు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చే శనిదేవుడు తిరిగి మొదటి రాశిలోకి రావడానికి మూడు దశాబ్దాల సమయం పడుతుంది. అలాగే అన్ని నక్షత్రాల్లో సంచారం చేయడానికి 27 సంవత్సరాల సమయం తీసుకుంటాడు. వచ్చేనెల 28వ తేదీన శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి అన్నీ అనుకూలమైన పనులే జరుగుతున్నాయి. కొన్ని రాశులవారు కుబేరులు కాబోతున్నారు.
తులారాశి
కెరీర్ కు సంబంధించి వీరు జీవితంలో ఇంతవరకు పొందని ప్రయోజనాలను పొందుతారు. కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎప్పటినుంచో వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారస్తులకు బాగుంది. ఉద్యోగస్థులకు మాత్రం ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఆర్థికంగా విశేష ప్రయోజనాలు పొందుతారు.

వృషభ రాశి
ఈ రాశిలో జన్మించినవారికి అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. గౌరవం లభిస్తుంది. కెరీర్ పరంగా విపరీతమైన లాభాలున్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉద్యోగస్థులు తాము పనిచేస్తున్నచోట కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు. ఏ పనికైనా ముందుగా సిద్ధంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.
కర్కాటక రాశి
జీవితంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది. మీకు తెలియకుండానే మీ జీవితం మారిపోతుంది. అదృష్టం పుష్కలగా ఉండటతో ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది. ఈ రాశిలో పుట్టినవారు విద్యార్జనలో ముందుంటారు. ఓర్పు ఎక్కువ. దీనివల్ల ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా జీవిస్తారు. ఒక్కోసారి మనస్పర్థలు ఏర్పడి పెద్దవి అవుతాయి. వాటిని నియంత్రించుకోవాల్సిన బాధ్యత ఈ రాశివారిపైనే ఉంటుంది.












Click it and Unblock the Notifications