అర్థకేంద్ర యోగంతో ఈ రాశులకు అంతులేని ధనం
నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం శని. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. అత్యంత నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తాడు. ఇవి అనుసరించేవారికి మంచి అనుగ్రహాన్నిస్తాడు. మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే గ్రహాల రాకుమారుడైన బుధుడు ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈనెల 18వ తేదీన ఈ రెండు గ్రహాలు 45 డిగ్రీల కోణంలో కలుసుకొని అర్థకేంద్ర యోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ యోగంవల్ల ఏ రాశులకు కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మీన రాశి
అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఒంటరిగా ఉంటున్నవారికి త్వరలోనే వివాహం కుదురుతుంది. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. కొత్తగా ఇంటిని లేదంటే స్థలాన్ని కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాన్ని కొంటారు. ఈ రాశివారు కూడా కోటీశ్వరులవడానికి అవకాశం ఉంది. ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పూర్తిచేస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మంచిది.

కర్కాటక రాశి
శుభవార్తలు వింటారు. ఒంటరివారికి వివాహమయ్యే అవకాశం ఉంది. వీరు కూడా కోటీశ్వరులవడానికి అవకాశం ఉంది. అదృష్టం తోడుండి అన్ని పనులు పూర్తిచేయిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. దీంతోపాటు ఆకస్మిక ధనయోగం ఉంది. ప్రయాణాలు చేస్తారు. అవి కూడా లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. జీవితంలో అభివృద్ధి చెందుతారు. ప్రేమ జీవితంలో ఉన్న ప్రేమికులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. పెద్దలు ఒప్పుకునే అవకాశాలున్నాయి.
వృషభ రాశి
వీరికి ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి తిరుగులేని ఫలితాలు కలుగుతాయి. వీరికి కోటీశ్వరులయ్యే యోగం ఉంది. జీవతంలో సంతోషం పెరగడంతోపాటు ఆర్థిక పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా పూర్తిగా విజయం దక్కుతుంది. అదృష్టం తోడుండి అన్నివిధాలుగా కలిసివస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. శనిదేవుడిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయి.












Click it and Unblock the Notifications