చంద్రుడు-రాహువు గ్రహణ యోగం.. ఈ రాశులు జాగ్రత్త!

చంద్రుడు మనసుకు కారకుడు. రాహువు నీడ గ్రహం. రాహువు ప్రతి 18 నెలలకు ఒకసారి నెమ్మదిగా తన రాశిని మారుస్తుంటాడు. గత నెల 18వ తేదీన రాహువు కుంభరాశిలోకి ప్రవేశించాడు. చంద్రుడు కూడా కుంభరాశిలోకి ఈనెల 16న ప్రవేశించాడు. దీనివల్ల రాహువు, చంద్రుడి సంయోగం జరిగి యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏయే రాశులకు ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందనే వివరాలను తెలుసుకుందాం.

కర్కాటక రాశి
ఉద్యోగస్తులకు తమ సహచరులతో వివాదాలు కలుగుతాయి. దీనివల్ల పై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం చాలావరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెద్దల సలహాను పాటించాలి. కుటుంబంలో అందరూ సంతోషంగానే ఉంటారుకానీ చెప్పుడు మాటలు వినొద్దు. కొందరి మాటలు మిమ్మల్ని బాధపెడతాయి.

three zodiac signs will face somany problems due to moon and rahu conjunction in aquarius

కుంభ రాశి
ప్రేమలో ఉన్నవారికి ఇబ్బందులున్నాయి. వ్యాపారస్తులు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తాయి. అవి పెద్దవుతాయి. వ్యాపారస్తులు సహనంతో ఉండాలి. అన్నదమ్ముల మధ్య గొడవలు రేగుతాయి. గతంలో ఉన్న సమస్యలు ఈ సమయంలో పెద్దవి అవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బయట ఎవరితోనైనా చాలా తక్కువగా మాట్లాడుతుండాలి.

మీన రాశి
వీరు తమ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మంచిది. ఎదుటివారితో మాట్లాడే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పొదుపుగా మాట్లాడాలి. విద్యార్థులు తమ పరీక్షా ఫలితాల్లో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిరోజులు ఎదురుచూడాలి. కోర్టు కేసుల నుంచి మాత్రం వీరికి విముక్తి కలుగుతుంది. ఇతరుల విషయాల్లో వేలు పెట్టొద్దు. కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమం. కుటుంబ సమస్యలు కూడా మిమ్మల్ని తీవ్రంగా చికాకు పరుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+