రాశిని మారుస్తున్న బృహస్పతి... ఈ రాశులకు అఖండ కుబేర యోగం
నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం బృహస్పతి. దేవతలకు గురువైన బృహస్పతి సంపదను, శ్రేయస్సును, వివాహాన్ని, సంతానాన్ని, ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు. జీవితాన్ని సరైన దారిలో నడిపించి మంచి స్థాయికి చేరుకునేలా చూసుకుంటాడు. ప్రస్తుతం వృషభరాశిలో సంచారం చేస్తున్న గురుడు మిథునరాశిలోకి వచ్చే నెలలో ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటున్నప్పటికీ కొన్ని రాశులపై మాత్రం ప్రత్యేకంగా ఉంటోంది. వారికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
వీరికి ధన ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంతోపాటు ప్రేమ జీవితంలో అన్నీ సమస్యలే ఉన్నాయి. అవన్నీ ఈ సమయంలో తగ్గిపోతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలున్నాయి. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది. ఉద్యోగస్థులకు వారు పనిచేసేచోట అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంతోపాటు వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి ఉంది.

తులా రాశి
శత్రువుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. దీనివల్ల వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. అనుకోకుండా ధన ప్రవాహం ఉంది. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోయి భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు. వ్యాపారం చాలా బాగా సాగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి. అన్నీ సానుకూలంగానే పరిణామాలుంటాయి.
వృషభ రాశి
ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారంతోపాటు వృత్తిలో కూడా మంచి లాభాలున్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ధనవంతులయ్యే యోగం ఉంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. దాంపత్య జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు. డబ్బుతోపాటు యోగం కూడా లభిస్తుంది. పెండింగ్ పనులను పూర్తిచేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంటారు.












Click it and Unblock the Notifications