అదృష్టం తలుపు తడుతోంది... ఈ రాశుల జీవితాన్ని పూర్తిగా మారుస్తున్న కేతువు
నవగ్రహాల్లో రాహువు, కేతువు నీడ గ్రహాలుగా పేరు తెచ్చుకున్నాయి. అందరూ ఈ రెండు గ్రహాలంటే భయపడతారుకానీ అవి చాలా మేలు కూడా చేస్తాయి. ఈ రెండు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి 18 నెలల సమయం తీసుకుంటాయి. అన్ని గ్రహాల్లా కాకుండా ఇవి తిరోగమనంలో సంచారం చేస్తాయి. కేతువు ఈనెల 16వ తేదీన తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. ఉత్తర మూడో పాదం నుంచి రెండో పాదంకు మారడంతో ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటున్నప్పటికీ ప్రధానంగా మూడు రాశులు మాత్రం మంచి ప్రయోజనాలను పొందనున్నాయి.
సింహ రాశి
న్యాయ సంబంధిత వివాదాలు కొంతకాలం నుంచి నడుస్తున్నాయి. ఈ సమయంలో వాటిల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలున్నప్పటికీ అవన్నీ క్రమేణా తగ్గిపోతాయి. చిరకాలంగా మీకున్న కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఏ పని పూర్తిచేయాలన్నా అందుకు వీరికి అదృష్టం తోడుంటుంది.

తులా రాశి
కొత్తగా కాంట్రాక్టులు లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంతో గడుస్తుంది. అందరూ కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. వ్యాపారంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. ఏ పని తలపెట్టినా అందులో అద్భుతమైన పురోగతి కనపడుతోంది. ఉద్యోగంతోపాటు, వ్యాపారాల్లో ఉన్నవారు కూడా అద్భుతమైన లాభాలను అందుకుంటారు. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. కుటుంబ జీవితం, వృత్తి జీవితం.. రెండూ బాగుంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశివారి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే సమస్యలన్నీ తగ్గిపోతాయి. జీవితంలో మంచి విజయాన్ని అందుకుంటారు. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని అందుకుంటారు. డబ్బులు పెట్టుబడి పెట్టే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో బాధపడాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications