13వ తేదీ నుంచి 138 రోజులు ఈ రాశులకు తిరుగులేదు
ప్రస్తుతం శనిదేవుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ రాశిలోనే తిరోగమనం చేస్తాడు. ఇది 138 రోజులు ఉంటుంది. జులై 13వ తేదీన తిరోగమన దిశ ప్రారంభమై నవంబరు 28వ తేదీ వరకు ఉంటుంది. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో పలు మార్పులు సంభవిస్తాయి. దీనివల్ల వారి జాతకం మొత్తం మారిపోయి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఏయే రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు సంభవించబోతున్నాయనే విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుందాం.
కర్కాటక రాశి
జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వీరి జీవితం అద్భుతంగా సాగుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినవారుంటే రెట్టింపు లాభాలతో వాటిని తిరిగి పొందుతారు. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాంతాల్లో వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడులను మళ్లిస్తారు.

మీన రాశి
ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాత వివాదాల నుంచి బయటపడతారు. వ్యక్తులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన అవసరంలేదు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ఆర్థికంగా కొన్ని లాభాలున్నాయి. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలి.
వృషభ రాశి
కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించి అన్ని పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తుల వేతనాలు భారీగా పెరుగుతాయి. జీవితంలో ఊహించనిరీతిలో కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. మొత్తంగా ఈ రాశివారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులను సమయంలోకా పూర్తిచేసి ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు.












Click it and Unblock the Notifications