ఈ నెల 15 నుంచి ఈ రాశులు నక్క తోక తొక్కుతున్నారు!
నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు, కళలకు, ఫ్యాషన్స్ కు కారకుడు. ఆయన జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. తన రాశి సంచారంలో భాగంగా ఈనెల 15వ తేదీన శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే సమయానికి అదే రాశిలో కేతువు, బుధుడు, సూర్యుడు కూడా ఉంటారు. ఇలా నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలుస్తుండటంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. ఇది చాలా శక్తివంతమైన రాజయోగం. దీనివల్ల మూడు రాశులవారి జీవితాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఆర్థికంగా బలపడటమే కాకుండా సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందుతారు.
మేష రాశి
ఈ రాశివారికి అనుకోకుండా ఆర్థిక లాభాలు కలిగి బాగా కలిసివస్తుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త పెట్టుబడులు ప్రారంభించానలుకుంటున్నవారికి కూడా ఇది మంచి సమయం. ప్రేమలో ఉన్నవారి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం కొంతకాలం ఆగక తప్పదు. ఇరువైపులా ఒప్పుకోవడానికి కొంత సమయం పడుతుంది. పిల్లలకు సంబంధించి అనేక శుభవార్తలు చెవిన పడతాయి.

కర్కాటక రాశి
పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. అంతేకాకుండా కొత్త ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటారు. వ్యాపారాలు, వృత్తిలో ఉన్నవారు అనేక లాభదాయకమైన అవకాశాలను అందిపుచ్చుకొని డబ్బు సంపాదిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి రాబడి వస్తుంది. మీ మాటతీరు, మీ వ్యక్తిత్వం సమాజంలో ప్రజలను ఆకర్షిస్తుంది. స్ఫూర్తిదాయకమైన మాటలతో ఇతరుల్లో మీ గౌరవాన్ని మరింత పెంపొందించుకుంటారు.
వృశ్చిక రాశి
ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని మోయాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారాన్ని ప్రారంభించిన పూర్వీకులు మంచి లాభాలను అందుకుంటారు. ఇతర ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్నవారికి కూడా ఇది మంచి సమయం. ఎంతో లౌక్యంగా వ్యాపారం చేసి మంచి పేరు సంపాదిస్తారు.












Click it and Unblock the Notifications