శక్తివంతమైన అర్థ-కేంద్ర యోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్యంలో సూర్య భగవానుడికి, బృహస్పతికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతి. దేవతలకు గురువు బృహస్పతి. ఈ రెండు గ్రహాలు రాశి సంచారం చేసినప్పుడు జాతకంలో ఈ రెండూ శుభస్థానంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతుంటాయి. ప్రస్తుతం గురుడు వృషభరాశిలో, సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ రెండు గ్రహాలు ఈ నెల 25వ తేదీన అర్థ కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ యోగం ప్రభావం వ్యక్తుల జీవితాల్లో ఆర్థిక మార్పులను తీసుకురాబోతోంది. ఏయే రాశులకు అర్థ కేంద్ర యోగంవల్ల ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి
వీరికి అదృష్టం కలిసివస్తుంది. సమాజంలో గౌరవం పెరగడంతోపాటు హోదా కలుగుతుంది. న్యాయ సంబంధిత విషయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారికి ఇప్పుడు బాగా కలిసివస్తుంది. అంతిమంగా వీరు అద్భుత విజయాన్ని నమోదు చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారు ఈ సమయంలోనే ప్రయత్నించాలి. గురుడివల్ల వీరికి మంచి లాభం కలుగుతుంది. ఊహించనిరీతిలో జీవితం పురోగమిస్తుంది. మీకు పనులన్నీ అనుకూలంగా జరగడానికి కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా మారడమే కారణం.

వృశ్చిక రాశి
ఈ రాశివారికి అనేక విజయాలున్నాయి. సూర్యుడివల్ల అధికంగా లాభాలను పొందుతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. శత్రువుల నుంచి కొన్నాళ్లుగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బంది తొలిగిపోతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంది. మంచి లాభాలను ఆర్జిస్తారు. ఇతర ప్రాంతాలకు, ఇతర ఊళ్లకు వ్యాపారాన్ని విస్తరించే యోచన చేస్తారు. బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగినప్పటికీ దాన్ని తట్టుకుంటారు. న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టు తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి.
మిథున రాశి
ఈ రాశివారు విశేషమైన ప్రయోజనాలను పొంది ఆనందంగా ఉంటారు. ఆధాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కనపరచడంతోపాటు మత పరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబంలోని సభ్యులంతా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో చోటుచేసుకున్న మార్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికంగా కుటుంబం చాలా బాగుంటుంది. అందరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి మొగ్గుచూపుతారు. వ్యాపారస్తులకు తిరుగుండదు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ సద్దుమణుగుతాయి. అందరూ సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్థులకు వారి పై అధికారుల నుంచి, తోటి ఉద్యోగుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వీరి పనితీరును అందరూ మెచ్చుకుంటారు.












Click it and Unblock the Notifications