ఈ రాశులకు రెండు తరాల ఐశ్వర్యాన్ని అందజేస్తున్న రాహువు

నవగ్రహాల్లో రాహువు అత్యంత కీలకమైన గ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఎప్పుడూ తిరోగమన దిశలో పయనిస్తుంటాడు. కేతువు కూడా ఇలాగే చేస్తుంది. ఈ రెండు గ్రహాలకు నీడ గ్రహాలని పేరు. వీటి పేరు తలుచుకుంటేనే ప్రజలు భయపడుతుంటారుకానీ ఈ గ్రహాలు కూడా చాలా మంచిని చేస్తాయనే విషయం తెలియదు. వచ్చేనెల 18వ తేదీ నుంచి రాహువు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ మూడు రాశులపై అధికంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

కన్యారాశి
వ్యాపారంలోను, ఇతరత్రా పెట్టుబడులు పెట్టాలని ఎదురుచూస్తున్నవారికి ఇది చాలా మంచి సమయం. కలిసివస్తుంది. అదృష్టం బాగా పట్టుకుంటుంది. గతంలోకంటే ఆర్థికంగా బాగా మెరుగవుతారు. పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. పెట్టిన పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలనిస్తాయి.

three zodiac signs will get financial benefits and good health due to rahu will enter aquarius

ధనుస్సు రాశి
వీరికి ఊహించనిరీతిలో లాభాలున్నాయి. డబ్బుకు సంబంధించి మంచి లాభాలను అందుకుంటారు. వీరి జాతకంలో మూడో స్థానంలోకి రాహువు ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల ప్రయాణాలు చేస్తారు. వాటి నుంచి కూడా ప్రయోజనాలను అందుకుంటారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యంతోపాటు మీ ఆరోగ్యంపై కూడా కచ్చితంగా దృష్టిసారించాలి. ఇబ్బందులుంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. అదృష్టం తోడుండి అన్ని పనులు సులువుగా అవుతాయి. ఆర్థికంగా వీరి జీవితం స్థిరపడుతుంది.

కుంభరాశి
ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశులవారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అన్నీ సానుకూల మార్పులే ఉంటాయి. ఒకటి రెండు మార్పులు మాత్రం ప్రతికూలంగా ఉంటాయికానీ వాటికి భయపడాల్సిన అవసరం లేదు. శివాలయంలోను, ఇతర ఆలయాల్లో ఉన్న నవగ్రహాలకు ప్రతిరోజు ప్రదక్షిణ చేస్తే మంచిది. ఆదాయం కూడా ఊహించని రీతిలో పెరుగుతుంది. కుంభరాశి శనిదేవుడి సొంతరాశి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గౌరవాన్ని అందుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+