2025వ సంవత్సరాన్ని ఈ రాశులకు రాసిచ్చిన బుధుడు
గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడం అనేది సహజంగా జరుగుతుండే పరిణామం. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతోపాటు మరికొన్ని లాభాలు కలుగుతాయి. నవగ్రహాలకు రాకుమారుడైన బుధుడు ఈనెల నాలుగోతేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. తెలివితేటలకు, సృజనాత్మకతకు కారకుడైన బుధుడి ప్రవేశం కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కల్పిస్తోంది. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మిథునం
ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. భారీగా పెట్టే పెట్టుబడులకు దూరంగా ఉండాలి. లేదంటే నష్టపోతారు. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గి అనుబంధం బలపడుతుంది. శుభవార్తలను వింటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధించడంతోపాటు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లడానికి ఇది మంచి సమయం వారికి. ఊహించనిరీతిలో ధనం రావడంవల్ల జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాశులవారిపైనే ఉంటుంది.

కన్య
సమాజంలో గౌరవం పెరుగుతుంది. హోదాను అందుకుంటారు. గతంలో మొదలైన పనులవల్ల ఇప్పుడు లాభాలను అందుకుంటారు. అధికారిక హోదాలో ఉన్నవారు సంతోషంగా జీవిస్తారు. మంచి గౌరవం కోసం, తగిన సందర్భం కోసం ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. రక్తానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు
ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దీనికోసం డబ్బులు ఖర్చుచేసే అవకాశం ఉంది. ఆర్థికంగా మీ పరిస్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు భారీగా లాభపడతారు. అమ్మకాలు, కొనుగోళ్లతో మంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్త దిశలో వ్యాపారాన్ని మళ్లిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధించే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం బాగుంటుంది.












Click it and Unblock the Notifications