ఈ రాశులకు అఖండ సంపదను ప్రసాదిస్తున్న బృహస్పతి

దేవతల గురువైన బృహస్పతి సంపదను, సంతానాన్ని, శ్రేయస్సును, ఆధ్యాత్మిక ఫలితాలను ప్రసాదిస్తాడు. జీవిత గమ్యం చేరుకునేందుకు సహకరిస్తాడు. దేవతలకే కాకుండా నమ్మినవారికి కూడా ఆయన గురువు. ఈనెల 12వ తేదీన సాయంత్రం గురుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దాదాపు ఏడాది కాలం తర్వాత ఈ రాశిలోకి సంచారం చేస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో ఆర్థికంగా పురోగతి ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారని చెబుతున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా గురుడివల్ల కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వృషభ రాశి
వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. కుటుంబంలో ఉన్న వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహా తీసుకోవాలి. లేదంటే నష్టపోతారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంవల్ల ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును గురుడు కల్పిస్తున్నాడు. అలాగే మంచి ఆరోగ్యం వీరి సొంతమవుతుంది.

three zodiac signs will get good health and wealth due to Jupiter will enter gemini

ధనస్సు రాశి
దీర్ఘకాలం నుంచి వేధిస్తున్న సమస్యలకు ఈ సమయంలోనే పరిష్కారం దొరుకుతుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బృహస్పతిని పూజించడంద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఏ పని తలపెట్టినా ఈ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. దీనివల్ల సమాజంలో గౌరవం, మర్యాద కలుగుతాయి. మీకు వ్యక్తిగతంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

కర్కాటక రాశి
సంపాదన పెరుగుతుంది. సమాజంలో హోదా లభిస్తుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుంచి బృహస్పతి బయటపడేస్తాడు. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. దాంతోపాటు ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను భారీగా విస్తరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు బృహస్పతిని పూజిస్తే ఊహించని ఫలితాలను సొంతం చేసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+