బృహస్పతి వల్ల ఈ రాశులకు బంకలా పట్టుకుంటున్న అదృష్టం
దేవతలకు గురువైన బృహస్పతి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతాడు. వివాహాన్ని, సంతానాన్ని ఇస్తాడు. పునర్వసు నక్షత్రంలో మొత్తం 4 పాదాలున్నాయి. గురుడు ప్రస్తుతం రెండో పాదంలోకి ప్రవేశించాడు. ఈ పాదానికి శుక్రుడు అధిపతి. శుక్రుడు సంపదను, అందాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు. బృహస్పతి నక్షత్ర సంచారం మూడు రాశులవారికి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తోంది. ఏయే రాశులకు ఏ విధంగా సంతోషం కలుగుతుందో తెలుసుకుందాం.
సింహ రాశి
ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారికి ఇరువైపులా కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం రాలేదు. అయితే ఇప్పుడు అంగీకరించకపోయినా త్వరలోనే వారి నుంచి మీకు శుభవార్త అందుతుంది. ఆర్థికంగా బలపడతారు. కెరీర్ పరంగా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల వల్ల ఎటువంటి సమస్య ఎదురు కాదు. అదృష్టం కలిసివస్తుంది.

కన్యారాశి
పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయడంవల్ల వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగస్థులు దూర ప్రయాణాలతోపాటు దగ్గరి ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలవల్ల ప్రయోజనాలున్నాయి. ఈ రాశివారు అదృష్ట జాతకులు అని చెప్పొచ్చు. నిరుద్యోగులకు పలుకుబడి ఉన్న వ్యక్తుల నుంచి సహాయం అంది ఉద్యోగం లభిస్తుంది.
మేష రాశి
కుటుంబ సభ్యుల మధ్య ఇప్పటివరకు ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారం కోసం ఊరు వదిలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది బాగా కలిసివస్తుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపడానికి కుటుంబ వాతావరణం తోడ్పడుతుంది. పెట్టుబడులు పెడితే వాటినుంచి మంచి లాభాలు వస్తాయి.












Click it and Unblock the Notifications