కులదీపక్ రాజయోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
సెప్టెంబరు 28వ తేదీన కుజుడు తులారాశిలో కదలికలు జరిపాడు. తులారాశిలో జరిగితే మకర రాశిలో కులదీపక్ రాజయోగం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు తెలియజేశారు. కెరీర్ పరంగా మంచి పురోగతికి ఇది తోడ్పడుతుంది. పనులన్నీ వేగంగా పూర్తిచేయగులుగుతారు. ఈ శక్తివంతమైన రాజయోగంతో ఎవరెవరు లాభపడతారనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కోరుకున్న కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. ఎన్నో శుభ సంఘటనలు జరుగుతాయి. అలాగే చేసే ప్రతి పనిలోను అద్భుతమైన లాభాలను పొందుతారు. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఈ రాశివారు కొంత జాగ్రత్త పాటించడం మేలు. లేదంటే వివాదాలకు దారితీసే అవకాశం ఉంది.

మకర రాశి
సమాజంలో ఈ రాశివారు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. జీవితంలో వస్తున్న అనేక అడ్డంకులను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి అద్భుతమైన పేరు సంపాదించుకుంటారు. చేస్తున్న పని వల్ల గౌరవం పెరుగుతుది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు.
మేషరాశి
అనేక అడ్డంకులు తొలగిపోతాయి. అదృష్టం కలిసివస్తుది. ప్రతి పనిలో సానుకూల పరిణామాలే ఎదురవుతాయి. కష్టపడి సంపాదిస్తున్న వ్యక్తులకు మాత్రం ఈ సమయంలో ఊహించనిరీతిలో లాభాలున్నాయి. రాబడి పెరిగి ఖర్చులు భారీగా తగ్గుతాయి. డబ్బును పొదుపు చేయడంవల్ల భవిష్యత్తులో మంచి రాబడిని అందుకుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంద్వారా అనుకున్న ఫలితాలను పొందుతారు.












Click it and Unblock the Notifications