సరిగ్గా 10 రోజులు ఆగండి... ఈ రాశుల పంట పండుతోంది
గ్రహాలకు సూర్య భగవానుడు అధిపతి. ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకునే సూర్యుడు ఈనెల 15వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే నెలలో గురుడి రాశిలోని సూర్యుడి సంచారం ఉంది. తిరిగి వచ్చేనెల 15వ తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుస్సు రాశి బృహస్పతి సొంత రాశి. ఈ రాశిలోకి సూర్యుడు రావడంవల్ల కొన్ని రాశులకు విపరీతంగా కలిసివస్తోంది. అలాగే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు కలుగుతాయి. 10 రోజుల తర్వాత ఈ రాశులవారి జీవితంలో ఊహించనిరీతిలో మార్పులు చోటుచేసుకోవడంతోపాటు ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటున్నారు. ఏయే రాశులకు కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఈ రాశివారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఎప్పటినుంచో వేధిస్తున్న న్యాయ సంబంధిత వ్యవహారాల్లో విజయం దక్కుతుంది. ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. నిధులను సమీకరించే విషయంలో సఫలమవుతారు. ఈ రాశివారు ఊహించనిరీతిలో లాభాలను పొందుతారు. విదేశాల్లో వ్యాపారం చేస్తున్నవారి పరిస్థితి బాగుంటుంది. అన్నివిధాలుగా కలిసివస్తుంది. ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది.

తులా రాశి
వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో తమ పనులు విజయవంతంగా పూర్తిచేసి ఆర్థిక లాభాలను పొందుతారు. వచ్చిన ప్రయోజనాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. ఇది చాలా మంచి సమయం. ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ రాశివారు మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళతారు.
సింహ రాశి
ఈ రాశికి సూర్యుడు అధిపతి. ఆరోగ్యం చాలా బాగుండటంతోపాటు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రేమ జీవితంలో రొమాన్స్ చాలా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉన్నాయి. సూర్యుడి అనుగ్రహం ఈ రాశివారికి దండిగా లభిస్తుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారు ప్రత్యర్థులపై పైచేయి సాధించడంతోపాటు మంచి లాభాలను ఆర్జిస్తారు.












Click it and Unblock the Notifications