డిసెంబరు నెలలో ఈ రాశులకు సిరి సంపదలు రాసిచ్చిన శుక్రుడు
నవగ్రహాల్లో శుక్రుడిది ప్రత్యేక స్థానం. సంపదకు, ప్రేమకు, విలాసవంతమైన జీవితానికి ప్రతీక. గ్రహం అన్న తర్వాత ఒక రాశి నుంచి మరోరాశిలోకి నిరంతరం సంచారం చేస్తుంటాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అలగే శుక్రుడు వచ్చేనెల రెండోతేదీన శనిదేవుడికి ఎంతో ఇష్టమైన మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
దీనివల్ల కొన్ని రాశులవారికి అనుకున్న పనులు సులువుగా జరుగుతాయి. డిసెంబరు మొదటి వారం నుంచే వీరు అద్భుతమైన ప్రయోజనాలను దక్కించుకుంటారు. అంతేకాదు.. దాంపత్య జీవితంలో పూర్తి మార్పులు వస్తాయి. భార్యాభర్తలిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఏయే రాశులవారికి శుక్రుడి సంచారంవల్ల కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వృషభ రాశి
గతం నుంచి వేధిస్తున్న డబ్బు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కొంతకాలం నుంచి పూర్తి కాకుండా పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ సమయంలనే పూర్తవుతాయి. డిసెంబరులో ఎంతో అదృష్టం వీరికి కలిసివస్తుంది. చేస్తున్న పనిపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత ఉండటంవల్ల సంపద వస్తుంది. డబ్బు రావడంకన్నా దాన్ని తిరిగి పెట్టుబడి పెట్టడంపైనే మీ అదృష్టం ఆధారపడివుంటుంది.
వృషభ రాశి
ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలను మార్పు చేస్తారు. అంతేకాదు ఈ రాశివారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టు తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి. ఉద్యోగస్తులకు వేతనాలు పెరిగి ప్రమోషన్ లభిస్తుంది. ఎంత నిరాడంబరంగా జీవితాన్ని గడిపితే అంత మంచిది. ఆధ్యాత్మిక పరమైన విషయాలపట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.
మిథున రాశి
ఈ రాశివారికి శుక్రుడు విశేష ప్రయోజనాలను కలిగించనున్నాడు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి మద్దతు లభించి పనులన్నీ విజయవంతంగా పూర్తిచేస్తారు. కొత్త సంవత్సరంలో కూడా వీరికి అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications