వెళ్తూ వెళ్తూ.. ఈ రాశుల తలపై పాలు పోసి వెళుతున్న డిసెంబరు నెల
గ్రహాలకు రాకుమారుడైన బుధుడు తెలివితేటలు, లెక్కలు, తర్కం, వ్యాపారానికి కారకుడు. డిసెంబరు నెలలో ఐదుసార్లు సంచారం చేస్తున్నాడు. 6వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత 10వ తేదీన అనురాధ నక్షత్రంలోకి, 24వ తేదీన జ్యేష్ఠ నక్షత్రంలోకి, 27వ తేదీన సంచారంలో మార్పు జరగడం, 29వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఒకే నెలలో బుధుడు 5 సార్లు సంచారం చేయడంవల్ల కొన్ని రాశులకు ఆర్థికంగా బాగా కలిసివస్తోంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి
పెట్టుబడి పెట్టినవారికి బాగా కలిసివస్తుంది. మంచి లాభాలు వస్తాయి. జీవితంలో ఆనందం నెలకుంటుంది. విద్యార్థులకు డిసెంబరు నెల చాలా బాగుంటుంది. ఈ రాశివారికి ఈ నెలలో మంచి జ్ఞానాన్ని ఆర్జిస్తారు. జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. అంతేకాకుండా పదిమందికి సాయం చేసే స్థాయికి చేరుకుంటారు.

మకర రాశి
ఎప్పటి నుంచో పూర్తికాకుండా పెండింగ్ లో ఉన్న పనులన్నీ డిసెంబరు నెలలో పూర్తవుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా కలిసివస్తుంది. జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు బుధుడి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బుధుడిని పూజించడంవల్ల అన్ని పనులు సత్వరమే పూర్తవుతాయి.
తులా రాశి
ఈ రాశివారు విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగం, వ్యాపారం, విద్య రీత్యా విదేశాలకు వెళతారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి ఎంతో సంక్లిష్టమైన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని సవాళ్లుగా స్వీకరించి విజయాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. వివాహమైనవారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు.












Click it and Unblock the Notifications