2025 మార్చి వరకు ఈ రాశులు అడుగు తీసి అడుగేసినా డబ్బులే
న్యాయదేవత అయిన శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. చాలా నెమ్మదిగా కదులుతుంటాడు. నవగ్రహాలన్నింటిలో నెమ్మదిగా కదిలే గ్రహం శనిదేవుడు. చేసిన కర్మలను ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఆయన అనుగ్రహిస్తే బిచ్చగాడు కోటీశ్వరుడవుతాడు.. ఆయన ఆగ్రహిస్తే కోటీశ్వరుడు బిచ్చగాడు అవుతాడు. ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్న శనిదేవుడు మార్చిలో మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
తులా రాశి
కొత్త ఇంటిని, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఎప్పటినుంచో వారు కోరుకుంటున్న మార్పు జరుగుతుంది. కుటుంబంలో సంతోషం అధికమవుతుంది. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తాడు. దాదాపు 86 రోజులపాటు వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించడానికి ముందు ఉన్న కాలమంతా వీరికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. కొత్త అవకాశాలు వస్తాయి.. వాటిని ఉపయోగించుకోవాలి. అన్నిరకాల వ్యాపారస్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది.

మేష రాశి
అనవసరమైన పనుల్లో, అక్కర్లేని పనుల్లో వేలు పెట్టకూడదు. లేదంటే తీవ్రమైన ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురవుతారు. విజయాన్ని దూరం చేసుకుంటారు. వ్యాపారస్తులు విజయాలను అందుకుంటారు. సంతోషంతోపాటు సంపద కలుగుతుంది. భార్యాభర్తల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువవుతాయి. సమాజంలో హోదా, గౌరవం కలుగుతుంది. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నవారికి కలిసివస్తుంది. వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడి వచ్చేవాటిపై పెట్టాలి. అప్పుడే మీరు విజయం సాధించినట్లు లెక్క.
సింహ రాశి
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వాటిద్వారా మంచి సక్సెస్ అవుతారు. పారిశ్రామికవేత్తలకు కూడా మంచి లాభాలున్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం బలపడుతుంది. సంతోషంగా జీవిస్తారు. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆర్థికంగా లాభపడతారు. అవకాశాలతోనే అడుగు ముందుకు వేయాలి. వేటినీ నిర్లక్ష్యం చేయవద్దు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఉద్యోగులకు వేతనాలు పెరగడంతోపాటు కెరీర్ పరంగా వృద్ధి ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఎటువంటి అడ్డంకులు ఎదురుకావు.












Click it and Unblock the Notifications