మార్చి నుంచి ఈ రాశులకు తిరుగులేదు.. జమిందారులవుతారు

నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు న్యాయదేవుడు. మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే అంతకు రెట్టింపు ఫలితాలనిస్తాడు. వచ్చేనెలలో శనిదేవుడు రాశిని మారుస్తున్నాడు. అలాగే సూర్యుడు, బుధుడు కూడా తమ రాశులను మార్చనున్నారు. గ్రహాల సంచారం పరంగా మార్చి నెల జ్యోతిష్యం ప్రకారం చాలా కీలకమైన నెలగా మారింది. బుధుడు మీన రాశిలోకి, సూర్యుడు.. శనిదేవుడితో కలిసి కుంభరాశిలో సంచారం చేస్తారు. ఈ మార్పులవల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మిథున రాశి
ఉద్యోగులు కార్యాలయంలో ఒత్తిడిని ఎదుర్కుంటారు. అయితే ఆ ప్రభావం ఇంటివరకు రాకుండా జాగ్రత్తపడాలి. లేదంటే కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. మార్చి నెల వీరికి చాలా బాగుంది. సమస్యలను అధిగమించగలిగితే అంతా ఆనందంగా ఉంటారు. అలాగే వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశివారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడికి, బుధుడికి, శనికి పూజలు జరిపించాలి.

three zodiac signs will get huge money due to key planets transit in march month

మేష రాశి
ఈ రాశివారికి విద్యకు సంబంధించిన రంగాల్లో విజయాలు దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. పెండింగ్ లేకుండా అన్ని పనులు చేస్తారు. వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. బుధుడు, సూర్యుడు ఈ రాశివారికి మార్చి నెలలో అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నారు.

కర్కాటక రాశి
ఈ రాశివారికి అనేక ఆర్థిక లాభాలున్నాయి. గతంలో కంటే ఈ సమయంలో ఆర్థికంగా మంచిస్థాయికి వస్తారు. అవకాశాలను గుర్తించాలి. వాటిని వినియోగించుకుంటే వీరికి తిరుగుండదు. ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. అలాగే వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో రాబడినిచ్చేలా పెట్టుబడులు పెట్టాలి. మాట తీరు విషయంలో అజాగ్రత్తగా ఉంటే నష్టాలు ఎదురవుతాయి. శివాలయాన్ని సందర్శించి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+