సొంత రాశిలోకి బుధుడు.. ఈ రాశులకు మైండ్ బ్లోయింగ్ లాభాలు!

గ్రహాల రాకుమారుడు బుధుడు. తెలివితేటలు, తర్కం, లెక్కలు, వ్యాపారం, జ్ఞానానికి కారకుడు. బుధుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. ఈ నెల 15వ తేదీన బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి బుధుడు ఒక్కోసారి 30 రోజులు తీసుకుంటే, మరోసారి 31 రోజులు తీసుకుంటాడు. కన్యారాశిలోకి బుధుడు రావడంవల్ల ఏయే రాశులకు కలిసివస్తుంది? వారికి ఏవిధంగా అదృష్టం పట్టుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మకర రాశి
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కలిసివస్తుంది. సానుకూల ఫలితాలుంటాయి. మంచి ప్రణాళికలతో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. అదృష్టం కలిసివచ్చు ఏ పనినైనా చాలా సులువుగా పూర్తిచేస్తారు. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణాలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మికంగా పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. ఈ సమయంలో చేసే పనులు చాలా సులువుగా పూర్తవుతాయి.

three zodiac signs will get huge money due to mercury will enter virgo from September 15th

మిథున రాశి
నాయకత్వ లక్షణాలు సొంతమవుతాయి. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ సమయంలోనే పరిష్కారం దొరుకుతుంది. అనుకున్న పనులను వేగంగా పూర్తిచేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. సంగీతం, విద్య, బ్యాంకింగ్, సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి కలిసివస్తుంది. అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. కొన్ని శుభవార్తలను వింటారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం అంతా అనుకూలంగా జరుగుతుంది.

కన్యా రాశి
వ్యాపారస్తులకు విశేషమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్థులకు కెరీర్ పరంగా ఊహించని లాభాలుంటాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. కోరుకుంటున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. ఆర్థికంగా కలిసివస్తుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని భార్యాభర్తలిద్దరూ చవిచూస్తారు. పెళ్లికానివారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బుధుడిని పూజించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+