ఈనెల 16 తర్వాత ఈ రాశుల తలరాత మారిపోతోంది... సంపద పెరుగుతుంది
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని మంచి యోగాలు, మరికొన్ని మిశ్రమ ఫలితాలను రాశి చక్ర గుర్తులకు కలిగిస్తాయి. గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. అలాగే ఈనెల 16వ తేదీన మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. దీనివల్ల కొన్ని రాశి చక్ర గుర్తులకు అదృష్టం కలిసి వస్తుంది. సూర్యుడి సంచారం వల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే వివరాలను తెలుసుకుందాం.
కన్యా రాశి
కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రతి పనిలోను అదృష్టం కలిసి వస్తుంది. ఏ పనిలోనైనా మీరు ఆశించినరీతిలనే ఫలితాలు కలుగుతాయి. కొత్తగా స్థలాన్ని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మీకు ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. కొత్తగా ఆదాయాన్ని ఆర్జించేందుకు మార్గాలు తోడవుతాయి. సమాజంలో మీకు ప్రశంసలు లభించడంతోపాటు గౌరవం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి బలమైన మద్దతు దొరుకుతుంది. జీవితం భౌతిక సుఖాలకు అలవాటు పడుతుంది.

సింహ రాశి
భార్యవైపు నుంచి మద్దతు బాగా దొరుకుతుంది. అత్తమామలు మంచి సపోర్టుగా ఉంటారు. దాంపత్య జీవితంలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని చవిచూస్తారు. ఈ రాశివారి సంపద పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందేందుకు అంతులేని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగపరుచుకుంటే మీకు తిరుగుండదు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథున రాశి
డబ్బును పొదుపు చేయడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. భవిష్యత్తుల రాబడి వచ్చేలా పెట్టుబడి పెడతారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో లేదంటే విడిగా తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంది. వ్యక్తిత్వాన్ని బాగా మెరుగుపరుచుకొని మంచి పేరు తెచ్చుకుంటారు. దీనివల్ల సమాజంలో మీకు గౌరవం కలుగుతుంది.












Click it and Unblock the Notifications