ఈ నెల 20వ తేదీ నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా ప్లాటినమే
రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు నవగ్రహాల్లో కీలక గ్రహం. శుక్రుడి అనుగ్రహంతో సంపద చేకూరుతుంది. విలాసవంతమైన జీవితానికి, కీర్తి, సౌభాగ్యం, అందం, కళలకు, ఫ్యాషన్ రంగాలకు కారకుడు. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. ఈనెల 20వ తేదీ నుంచి శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చుకుంటున్నారు. మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీనికి కుజుడు అధిపతి. శుక్రుడి నక్షత్ర సంచారం ఏయే రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది?, ఆర్థికంగా వారికి ఎటువంటి లాభాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
దాంపత్య జీవితం చాలా మధురంగా సాగుతుంది. ఉద్యోగస్థులకు ఈ సమయం బాగా కలిసిరానుంది. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బలపడతారు. కెరీర్ పరంగా తిరుగుండదు. ఉద్యోగంలో ఆదాయం, వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో కొన్నాళ్లుగా ఉన్న సమస్యలన్నింటికీ విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

తులా రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ప్రతి పనిలోను పాజిటివ్ చూస్తారు. వ్యతిరేక ఆలోచనలను రానివ్వరు. సమాజంలో చాలా శక్తివంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకుంటారు. నిలిచిపోయిన నిధులను ఉపసంహరించుకునే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో శుభకార్యాలున్నాయి.
మిథున రాశి
ఉద్యోగస్థులకు వారి కార్యాలయాల్లో ఫలితాలు అనుకూలగా వస్తాయి. కొత్తగా భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. ఆస్తికి సంబంధించిన వివాదాల్లో విజయం మీవైపే వస్తుంది. లక్ష్యాలను చేరుకునేందుకు బాగా కష్టపడతారు. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. వీరు మంచి పురోభివృద్ధి సాధిస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శుక్రుడిని పూజించాలి.












Click it and Unblock the Notifications