2025 సంవత్సరాన్ని అద్భుత ధనయోగంతో ఈ రాశులకు రాసిపెట్టిన బృహస్పతి
ఖగోళంలో గ్రహాల కదలికలు సంఘ జీవితంతోపాటు మానవుల వ్యక్తిగత జీవితాన్ని కూడా శాసిస్తాయి. 2025లో దేవతల గురువైన బృహస్పతి అండతో, ఆయన ఆశీర్వాదంతో కొన్ని రాశులవారి జీవితాలు మలుపు తిరుగుతున్నాయి. సంవత్సరానికి ఒకసారి గురుడు తన రాశిని మార్చుకుంటాడు. సంపదకు, పిల్లలకు, సౌభాగ్యానికి, ఆధ్యాత్మికతకు కారకుడయ్యే బృహస్పతి మే ఒకటో తేదీ నుంచి మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఏడాది పొడవునా ఇదే రాశిలో ఉంటాడు కాబట్టి ఆర్థికంగా కలిసివచ్చే రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
బృహస్పతి ఈ రాశివారి 1వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల దాంపత్య జీవితం బాగుంటుంది. ఎటువంటి గొడవలు రావు. పనిచేసే ప్రాంతాల్లో ఈ రాశులవారికి మంచి వృద్ధి ఉంది. ఆర్థిక లాభాలు పొందుతారు. జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. అయితే ఏ పని తలపెట్టేముందైనా బృహస్పతిని పూజించడం మంచిది. నవగ్రహాల్లో ఒకటైన బృహస్పతిని గురువారం పూజించి పని మొదలుపెడితే మంచి ఫలితాలను అందుకుంటారు. మీకు అదృష్టం తోడుంటుంది.

సింహ రాశి
ఈ రాశిలో 10వ ఇంట్లో గురుడు ఉన్నాడు. తిరోగమన దిశలో ఉండటంవల్ల వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేయడంవల్ల అనుకున్న పనులు పూర్తికావడమే కాకుండా ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. ఎటువంటి అహంకార ధోరణి ప్రదర్శించకుండా భార్యాభర్తలిద్దరూ ఒకటే అన్న ఆలోచనతో అనుకున్న పనిని పూర్తిచేసి మంచి ఫలితాలు పొందాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కర్కాటకం
ఆదాయంలో ఈ రాశివారికి భారీ పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిచక్రంలోని 11వ ఇంట్లో బృహస్పతి సంచారం చేస్తున్నాడు. దీనివల్ల వీరికి అదనపు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అన్నివైపుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సంపాదించిన డబ్బును భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. అలా చేయకపోతే నష్టపోతారు. అందుకు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. వృథా ఖర్చులు తగ్గించుకుంటే ఆదాయం ఎక్కువగా కనపడుతుంది.












Click it and Unblock the Notifications