ఈ రాశులవారి కోసం మోయలేనంత డబ్బును మోసుకొస్తున్న బృహస్పతి
నవగ్రహాల్లో అత్యంత శుభకరమైన గ్రహం ఏదయ్యా అంటే అది బృహస్పతి అని చెబుతారు పండితులు. దేవగురువైన బృహస్పతి జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ జాతకుడికి, జాతకురాలికి తిరులేదని చెప్పొచ్చు. అన్నివిధాలుగా జీవితాన్ని తీర్చిదిద్దుతాడు. వృషభరాశిలో సంచరిస్తున్న గురువు మృగశిర నక్షత్రం నుంచి రోహిణీ నక్షత్రంలోకి మారబోతున్నాడు. ఈ పరిణామం ఈనెల 28వ తేదీన చోటుచేసుకుంటుంది. ఇలా గురువు నక్షత్రాన్ని మార్చుకోవడం అనేది అన్ని రాశులవారికి అదృష్టం అని చెప్పొచ్చు. ఏయే రాశులవారికి ఏవిధంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
నిరుద్యోగులకు బాగా కలిసివచ్చే సమయం అని చెప్పొచ్చు. కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి. దీనివల్ల సమాజంలో గౌరవం పెరగడంతోపాటు కొత్తగా ఆదాయ మార్గాలు తోడవుతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది కూడా లాభసాటిగానే ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. ఈ రాశివారికి గురువు అదృష్టాన్ని కావల్సినంత ఇస్తున్నాడని పండితులు తెలియజేస్తున్నారు.

ధనుస్సు రాశి
ఆర్థికంగా కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆకస్మికంగా ధనం చేతికి వస్తుంది. దీంతో పొదుపు చేస్తారు. ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. జీవిత భాగస్వామి సలహాతో చేసే పనుల్లో విజయాన్ని అందుకుంటారు. ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న పని ఈ సమయంలో పూర్తవుతుంది. మీ కల నెరవేరుతుంది.
సింహ రాశి
కన్నతల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమే మీకు దైవం. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కూడా దక్కుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలి. మంచి ప్రణాళికలుంటే వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. మంచి ఆరోగ్యం కోసం జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications