శక్తివంతమైన గజకేసరి రాజయోగంతో ఈ రాశులకు ఇల్లు, వాహనం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. అందుకు ఒక్కో గ్రహం ఒక్కో సమయం తీసుకుంటుంది. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని శుభ యోగాలు, మరికొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తుంటాయి. దేవతల గురువైన బృహస్పతి, చంద్రుడి కలయిక వల్ల శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. ఈ నెల 22వ తేదీన చంద్రుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయానికి గురువు అక్కడే ఉండటంవల్ల గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల ఏయే రాశులు లాభపడతారు అనే విషయాలను తెలుసుకుందాం.
మిథున రాశి
దాంపత్య జీవితంలో కొన్నాళ్లుగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తండ్రివైపు నుంచి పూర్తి మద్దతు లభించి విజయాలను సులువుగా సాధిస్తారు. విజయవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఇదే సమయంలో విదేశీ ప్రయాణానికి ఆస్కారం ఉంది. పెట్టుబడులు పెడితే వాటినుంచి భారీ లాభాలను ఆర్జిస్తారు. గజకేసరి రాజయోగం వీరిని ఆర్థికంగా అత్యంత బలవంతులుగా చేస్తోంది.

సింహ రాశి
ఉద్యోగస్థులకు వారు పనిచేస్తున్న ప్రదేశంలో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరంలేదు. జీవిత భాగస్వామితో ఎంతో ప్రేమగా ఉంటారు. ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. పిల్లలకు సంబంధించి కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
కన్యా రాశి
ఈ సమయంలో ఈ రాశివారు అనేక విషయాలను సాధిస్తారు. విద్యార్థులకు బాగుంది. వారు కూడా విజయాలను సాధించే సమయం ఇదే. కెరీర్ పరంగా ఉద్యోగస్థులకు కలిసివస్తుంది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఆస్తులకు సంబంధించి తండ్రివైపు, భార్యవైపు ఏదో ఒకవైపు నుంచి కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications