వాస్తు దోషాలు లేకుండా అదృష్టం కలిసిరావాలంటే లెక్కలు ఇలా ఉండాలి!
భారతీయ సాంప్రదాయంలో వాస్తు ప్రత్యేక శాస్త్రం. కట్టడం ఏదైనా సరే దానికి వాస్తు కచ్చితంగా అన్వయిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలన్నా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనుకున్నా, మంచి ఆరోగ్యంతో ఉండాలన్నా పెద్దలు కచ్చితంగా వాస్తును చూస్తారు.
ఇంటికి సింహ ద్వారం ఎదురుగా ఎప్పుడూ మెట్లు ఉండకూడదు.
మెట్లు బేసి సంఖ్యలో ఉండాలి
ఇంటికి ప్రధాన ద్వారం ఎప్పుడూ ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి.
ప్రధాన ద్వారం లోపల వైపు చిన్న గంటలు వేలాడదీయాలి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
ప్రధాన ద్వారం ముందు చెట్లు, స్తంభాలు లేకుండా చూసుకోవాలి.
ప్రధాన ద్వారం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి.

పూజ గది ఈశాన్యంలో ఉండాలి.
తూర్పు వైపు తిరిగి కూర్చొని పూజ చేయాలి.
వంట గది ఆగ్నేయంగా ఉండాలి.
వంట తూర్పు వైపు, ఉత్తరంవైపు తిరిగి చేయాలి.
స్టవ్, సింక్ పక్కపక్కనే ఉండకూడదు.
నైరుతి దిశగా పెద్ద పడక గది ఉండాలి.
తల పడమర, దక్షిణం వైపు పెట్టాలి.
మంచానికి ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉండకూడదు. ఉంటే రాత్రి వేళ గుడ్డతో కప్పాలి.
గదుల అమరిక బాగుండాలి.
రంగు కూడా వాస్తు ప్రకారం ఉండాలి.
ముదురు కాకుండా లైట్ రంగులు వాడాలి. వీటివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
గాలి, వెలుతురు లోపలికి వచ్చేలా చూసుకోవాలి.
నీళ్లు ఎక్కడైనా కారుతుంటే వెంటనే మరమ్మతు చేయాలి.
నీటి లీకేజీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.
పగిలిపోయిన వస్తువులు ఉండకూడదు.
మెట్లు తూర్పు, ఉత్తరంవైపు ఉండకూడదు.
ఇంటి ఆవరణం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
తులసి చెట్టును పెంచితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
చేపల ఆక్వేరియం ఆగ్నేయ దిశలో ఉండాలి.












Click it and Unblock the Notifications