నేటినుండి ఈ రాశులవారికి జాక్ పాట్ ప్రకటించిన ద్విద్వాదశ యోగం!
జ్యోతిష్య శాస్త్రంలో దేవతలకు గురువైన బృహస్పతికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది . బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంవత్సర కాలానికి ప్రయాణం చేస్తాడు అంటే ద్వాదశ రాశులలో బృహస్పతి సంచారానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. దేవతల గురువుగా చెప్పుకునే బృహస్పతి జ్ఞానం, తెలివితేటలు, అదృష్టం, వివాహం, సంపద మొదలైన వాటికి కారకుడిగా చెబుతారు.
ద్వి ద్వాదశ యోగం.. ఈ రాశులవారిదే అదృష్టం
గురువు మిధున రాశిలో ఉన్నాడు. ఇక శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. నేటి తెల్లవారుజామున 4.39 నిమిషాలకు బృహస్పతి శుక్రుడు ఒకరికొకరు 30 డిగ్రీల దూరంలోకి వచ్చారు. ఈ కారణంగా ద్వి ద్వాదశ యోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మేషరాశి
మేషరాశి జాతకులకు గురు శుక్రుల కారణంగా ఏర్పడే ద్వి ద్వాదశ యోగం చాలా శుభప్రదం గాను, ప్రయోజనకరంగాను ఉంటుంది. ఈ యోగం కారణంగా మేషరాశి వారు శక్తి సామర్థ్యాలతో పనిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు .వర్తక వ్యాపారాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. మేషరాశి వారి ఆర్థికస్థితి బలోపేతం అవుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం, ప్రేమ ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మతపరమైన పర్యటనలు చేయవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది.
మిధున రాశి
మిధునరాశి జాతకులకు గురు శుక్రుల కారణంగా ఏర్పడే ద్వి ద్వాదశ యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిధునరాశి వారు అయినా ఆశించిన ఫలితాలు పొందుతారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. సమాజంలో ప్రముఖులు గౌరవనీయులైన వ్యక్తులతో సానుకూల సంబంధాలు ఉంటాయి. అదృష్టం మీకు కలిసి వస్తుంది. విద్యా రంగంలో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇది మీకు మంచి సమయం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ద్వి ద్వాదశ యోగం అదృష్టాన్ని తెస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు తొలగిపోతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే సమయం అనుకూలంగాను ప్రయోజనకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. సామర్థ్యం పెరుగుతుంది. అత్తమామల వైపు నుండి శుభవార్తలు వింటారు .వ్యాపారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications