నేడు చంద్రఘంటగా దుర్గాదేవి; పూజిస్తే ఈతి బాధలు మాయం!!
దేవి శరన్నవరాత్రులు దేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూడవ రోజు దేవీ శరన్నవరాత్రులలో భాగంగా దుర్గాదేవి చంద్ర ఘంట రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు చంద్ర ఘంటగా ఉండే దుర్గాదేవిని ఏ విధంగా పూజించాలి? చెయ్యవలసినది ఏమిటి? చేయకూడనిది ఏమిటి? పూజిస్తే కలిగే ఫలితాలేమిటి? అనే వివరాలను తెలుసుకుందాం.
దేవీ శారద నవరాత్రులలో మూడవ రోజున దుర్గాదేవి చంద్ర ఘంట రూపంలో దర్శనమిస్తారు. శిరస్సుపై చంద్రుడిని ధరించిన కారణంగా ఈ అమ్మవారిని చంద్రఘంటాదేవి అమ్మవారిగా కొలుస్తారు. నవరాత్రులలో మూడవ రోజు అయిన చంద్రఘంటాదేవి అంటే అమ్మవారిని గాయత్రీ దేవి రూపంలో అలంకరిస్తారు. అమ్మవారిని ఈరోజు పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజించే వారు అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది.

చంద్ర ఘంట దుర్గాదేవి మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్ర ఖండ, రణ చండీ, చండికా అని కూడా పిలుస్తారు. చంద్రఘంట అంటే అర్థ చంద్రాకారంతో ఘంట కలిగినది అని అర్థం. సింహవాహిని అయిన అమ్మవారు ధైర్య ప్రదాయిని. చంద్రఘంటాదేవి రూపం కొంచెం ఉగ్రంగా అనిపించినప్పటికీ ఎల్లప్పుడూ ప్రశాంత వదనం తోనే ఉండే ఈ తల్లి ఎనిమిది చేతులతో ఉంటుంది.
ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో గద, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి చెయ్యి మాత్రం అభయ ముద్రతో ఉంటుంది. చంద్రఘంటాదేవి పులిమీద గాని సింహం మీద గాని తిరుగుతుంది. ఈ తల్లి సౌందర్యానికి శివుడు ముగ్ధుడు అయ్యాడని చెబుతారు. ఈ అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దాన్ని చేయడం వల్ల రాక్షసుల గుండెలు అవిసిపోయాయని చెబుతారు.
అయితే ఈ ఘంట నినాదం భక్తులకు మాత్రం శుభదాయకంగా ఉంటుందని చెబుతారు. నవ రాత్రులలో చంద్ర ఘంట అమ్మవారిని పూజిస్తే పాపాలు తొలగి పోతాయని, ఈతి బాధలు తొలగిపోతాయని, రోగాల నుంచి, మానసిక రుగ్మతల నుంచి, భూత భయాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications