Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడు బ్రహ్మచారిణిగా దుర్గాదేవి; పూజిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు!!

దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నేడు రెండవ రోజు దేవీ శరన్నవరాత్రులలో భాగంగా దుర్గాదేవి బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు బ్రహ్మచారిణిగా ఉండే దుర్గాదేవిని ఏ విధంగా పూజించాలి? ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? చెయ్యవలసినది ఏమిటి? చేయకూడనిది ఏమిటి? పూజిస్తే కలిగే ఫలితాలేమిటి? అనే వివరాలను తెలుసుకుందాం.

నవరాత్రులలో రెండవ రోజున దుర్గాదేవి బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తారు. తెల్లని వస్త్రాలతో ఒక చేతిలో జపమాల, మరో చేతిలో కమండలంతో బ్రహ్మచారిణి దర్శనమిస్తుంది. నేడు బ్రహ్మచారిణిగా ఉన్న దుర్గాదేవిని బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి, ఒక శుభ్రమైన వస్త్రాన్ని పరుచుకొని, దానిపై కూర్చుని అమ్మవారిని పూజించాలి. పూజా కార్యక్రమాలలో పూలు, పండ్లు, అక్షంతలు, చందనం మొదలైనవి సమర్పించాలి. పంచామృతాన్ని అమ్మవారికి ఇష్టమైన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి.

 Today, Durga devi is as brahmacharini; This is the results of worship!!

ఈరోజు బ్రహ్మచారిణి అమ్మవారికి తమలపాకులు, లవంగాలు నైవేద్యంగా పెడతారు. దుర్గా సప్తశతి పఠనం చేస్తారు. తల్లి బ్రహ్మచారికి సంబంధించిన మంత్రాలను జపించి, అమ్మవారికి హారతి ఇస్తారు. బ్రహ్మచారిణిగా ఈ రోజు అమ్మవారిని పూజించడం సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రధానంగా బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బ్రహ్మచారిణికి సంబంధించిన పూజా కార్యక్రమం అపారమైన శక్తిని కలిగి ఉంటుంది.

మన జ్ఞానాన్ని ఎంతగానో పెంచుతుంది. జీవితంలోని కష్టాలను తొలగిస్తుంది. బ్రహ్మచారిణిని పూజించడం వల్ల జీవితంలో బలం, నిగ్రహం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక ఈరోజు బ్రహ్మచారిణికి ఇష్టమైన తెలుపు వస్త్రాలు, లేదా గులాబీ రంగు వస్త్రాలు కట్టుకుంటే మేలు జరుగుతుందని చెబుతారు.

తల్లి బ్రహ్మచారిణి ని పూజించేవారు నిజమైన భక్తితో, అమ్మవారిని పూజిస్తే జ్ఞాన సంపన్నులు అవుతారని చెబుతారు. ఈరోజు అమ్మవారికి వెండి వస్తువులను సమర్పించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. చదువులోనూ, అన్ని రంగాలలోనూ విజయం సాధించాలని భావించేవారు బ్రహ్మచారిణి దేవితో పాటుగా సరస్వతీ మాతను ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. నవరాత్రులలో అమ్మవారి ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ రూపం విశేషం తెలుసుకుని తదనుగుణంగా అమ్మవారిని పూజించాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+