today horoscope: నేడు వీరు నక్కతోక తొక్కుతున్నారు.. గ్రహాల మహిమ!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. డిసెంబర్ 26 శుక్రవారం ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ద్వాదహ్స రాశులవారికి సానుకూల ప్రతికూల ఫలితాలు వస్తాయి. మరి నేడు 12 రాశులవారికి జాతక ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
మేష రాశి
మేషరాశి జాతకులకు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

వృషభ రాశి
వృషభరాశి వారికి నేడు మనశ్శాంతి కలుగుతుంది. ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలమైన రోజు. వృషభ రాశి కుటుంబ సహకారం లభిస్తుంది.
మిథున రాశి
మిధున రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. భావోద్వేగాలను నియంత్రించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి దాంపత్యం, భాగస్వామ్య విషయాల్లో కీలక చర్చలు జరుగుతాయి. సంబంధాల్లో స్పష్టత వస్తుంది.
సింహ రాశి
సింహరాశి జాతకులకు పనిభారం పెరిగినా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యంపై, ముఖ్యంగా ఒత్తిడిపై శ్రద్ధ వహించాలి.
కన్య రాశి
నేడు కన్యా రాశి జాతకులలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరుగుతాయి. ప్రేమ, సంతాన విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి.
తుల రాశి
తులా రాశి వారి కుటుంబ విషయాలు ప్రాధాన్యత పొందుతాయి. ఇల్లు లేదా ఆస్తి సంబంధిత నిర్ణయాలు ముందుకు సాగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు సంభాషణా నైపుణ్యంతో విజయాలు సాధిస్తారు. సమావేశాలు, చిన్న ప్రయాణాలు లాభిస్తాయి.
ధనుస్సు రాశి
నేడు ధనుస్సు రాశి వారికి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. మాటలలో సంయమనం అవసరం.
మకర రాశి
మకర రాశి జాతకులు నేడు వ్యక్తిగతంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరిగి నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి.
కుంభ రాశి
కుంభరాశి వారికి అంతర్ముఖత పెరుగుతుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ధ్యానం, విశ్రాంతి మేలు చేస్తాయి.
మీన రాశి
మీనరాశి జాతకులకు నేడు మిత్రుల సహకారం లభిస్తుంది. లక్ష్యాల సాధనలో పురోగతి ఉంటుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications