Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అత్యంత అరుదైన మహిమాన్వితమైన రోజు నేడు!!

ఈరోజు అత్యంత అరుదైన మహిమాన్వితమైన రోజు. ఈ రోజు కార్తీక సోమవారం. కార్తీక మాసంలో సోమవారానికి ఉండే ప్రత్యేకత అందరికీ తెలిసిందే. కార్తీక మాసం శివుడికి, విష్ణు మూర్తికి పరమ పవిత్రమైన మాసం. ఈ నెలలో ఎవరైతే అత్యంత భక్తి, శ్రద్ధలతో శివుడిని పూజిస్తారో వారికి శివ సాయుజ్యం లభిస్తుందని చెప్తారు . అలాగే విషువును ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి విష్ణు సాయుజ్యం లభిస్తుందని నమ్ముతారు.

అలాంటి ఈ పవిత్ర మాసంలో సోమవారం తో పాటు మరో విశేషం కూడా ఉంది.నేడు సోమవారం, మాస శివరాత్రి, ముఖ్యంగా కార్తీక మాసం. ఈ మూడు విశేషాలు ఒకే రోజు కలిసి రావటం నిజంగా భక్తులకు ఒక అద్భుత అవకాశం అనే చెప్పాలి. ఈ రోజు శివుడిని కొలిచిన వారికి వారి జీవితంలోని దోషాలన్నీ తొలగిపోయి, కష్టాలు నశిస్తాయని చెప్తారు. జీవితంలో ఉన్నతి లభిస్తుందని శివ పురాణం స్పష్టం చేస్తుంది.

Today is a very rare glorious day in karthika masam.. know this

ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని, ఉదయం ఇంట్లో భక్తితో శివుడిని బిల్వ పత్రాలతో పూజించాలి. శక్తి , అవకాశం ఉన్నవారు శివుడికి రుద్రాభిషేకం ఇంట్లో చేయిస్తే చాలా మంచిది. లేదంటే సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్లి అయినా శివుడికి రుద్రాభిషేకం చేయించాలి.

ఇక ఈ రోజు ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించని వారు ఉపవాసం చేస్తున్నట్లయితే వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు .ఈ రోజు ముఖ్యంగా సాయంత్రం సమయంలో అభిషేకం చేయించుకోవటం చాలా మంచిదని చెప్తున్నారు. ఈ రోజు శివారాధన, శివుడి కోసం చేసే ఉపవాసం, శివాలయాల దర్శనం భక్తులకు అఖండ కోటి పుణ్య ఫలితం ఇస్తుందని శివ పురాణం చెప్తుంది.

కనుక ఈ మహా మహిమాన్వితమైన సోమవారాన్ని శివుడి పూజకు కేటాయించి మంచి ఫలితాలు పొందాలని చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి బోలెడన్ని విశేషాలు శివ పురాణంలో ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో శివ పురాణం చదివినా కూడా విశేషంగా ఫలితాలు వస్తాయి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+