ధన త్రయోదశి నేడే.. బంగారం, వెండి కొనలేకుంటే ఇవి కొనుక్కోండి చాలు.. లక్ష్మీకటాక్షం!
దీపావళికి ముందు జరుపుకునే ధన త్రయోదశి చాలా పవిత్రమైనది శుభకరమైనది. ధన త్రయోదశి పండుగ నాడు కుబేరుడిని ధన్వంతరిని లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈరోజు చేసే పూజలు, చేసే కొనుగోళ్లు ఏడాది పొడవున ఇంటికి శ్రేయస్సును, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని చెబుతారు. ఇక చాలామంది ధన త్రయోదశి రోజు బంగారం, వెండి, వాహనాలు, పాత్రలు, కొత్త బట్టలు లేదా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
బంగారం,వెండి కొనుగోలు చేయలేకపోతే ఇవి కొనండి
మత విశ్వాసాల ప్రకారం ఈరోజు ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి, కుబేరుడు సంతోషిస్తారని చెబుతారు. అయితే ఈరోజు బంగారం లేదా వెండి కొనుగోలు చేయలేని వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బంగారం ,వెండి కొనుగోలు చేయలేకపోతే ఆ స్థానంలో కొనుగోలు చేయదగిన కొన్ని వస్తువులను గురించి చెప్పారు.

ధన త్రయోదశి పండుగ నాడు ఇవి ఇంటికి తెచ్చుకుంటే మంచిది
ఈ వస్తువులన్నీ లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉన్న వస్తువులు కావడంతో మీరు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే వాటి ఉనికి లక్ష్మీదేవి ప్రసన్నాన్ని కలిగిస్తుంది. అవి ఏమిటో తెలుసుకుందాం. ధన త్రయోదశి పండుగ నాడు తమలపాకును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది. బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, గణేశుడు మరియు యముడు తమలపాకును కొనుగోలు చేయడం వల్ల శుభాలను ఇస్తారు. ఇది వీరికి శ్రేయస్సును గౌరవాన్ని పెంచుతుంది.
లక్ష్మీ కటాక్షం కోసం ఇవి కొనుగోలు చేసి తెచ్చుకోండి
మరమరాలను కొనుగోలు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం తయారు చేసి పెడితే కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధనత్రయోదశి పండుగ నాడు చీపురు కొనడం శుభప్రదంగా చెప్పబడుతుంది. చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉన్న వస్తువు కావడంతో చీపురును కొనుగోలు చేసిన వారికి పేదరికం తొలగిపోయి ఇంటికి అదృష్టలక్ష్మి వస్తుంది. ధన త్రయోదశి పండుగ నాడు గవ్వలు గాని, గోమతి చక్రాన్ని గాని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే అది చాలా శుభప్రదం.
దీనితో కరుణించే లక్ష్మీదేవి
ధన త్రయోదశి రోజు ధనియాలు కొనుగోలు చేసి తెచ్చుకుంటే మంచిది. ధనియాలు రెండు లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి, వాటిని గుంట తీసి పాతిపెట్టి కొత్తిమీర గా పెంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధన త్రయోదశి పండుగ నాడు కల్లు ఉప్పు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే మంచిది.
దరిద్ర దేవత బయటకు వెళ్ళాలంటే ఇలా చెయ్యండి
ఈ ఉప్పుతో ఇల్లంతా శుభ్రం చేస్తే ఇంట్లో దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ధన త్రయోదశి నాడు ఏడు ముఖాల రుద్రాక్షలు కొనుగోలు చేసుకుంటే మంచిది. ఏడు ముఖాల రుద్రాక్షలు దొరకకపోతే ఐదు ముఖాల రుద్రాక్షలు నైనా కొనుగోలు చేసుకుంటే మంచి జరుగుతుంది.












Click it and Unblock the Notifications