నేడు విజయ ఏకాదశి.. అన్నింటా విజయం కోసం ఇలా చెయ్యండి!!
హిందూ మతంలో ఏకాదశి తిథికి చాలా ప్రత్యేకమైనస్థానం ఉంటుంది. ఇక విజయ ఏకాదశికి ఉండే స్థానం చెప్పనక్కర లేదు. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశి విజయ ఏకాదశి. ఈ విజయ ఏకాదశి నాడు ఎవరైతే శ్రీమహా విష్ణువును అత్యంత నిష్ఠతో పూజిస్తారో వారు విజయాలను పొందుతారు. అన్ని విషయాలలో సక్సెస్ అవుతారు.
ఈ సంవత్సరం విజయ ఏకాదశి నేడు బుధవారం మార్చి 6, 2024న జరుగుతుంది. ఈ రోజున తిథి ఉదయం 6:33 గంటలకు ప్రారంభమై మార్చి 7, 2024 తెల్లవారుజామున 4:16 గంటలకు ముగుస్తుంది. విజయ ఏకాదశి మతపరంగా, ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది. విజయ ఏకాదశి అన్నపేరులోనే విజయం ఉంది. ఈ ఏకాదశి రామాయణ కాలంతో ముడిపడి ఉంది.

ఇబ్బందికర పరిస్థితుల నుంచి వ్యక్తులను నడిపించడంలో విజయ ఏకాదశి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి అన్ని ప్రయత్నాలలోనూ విజయం సిద్ధిస్తుంది. ఈరోజు శ్రీరామచంద్రుడు సీతాదేవిని రావణుని చెర నుండి విడిపించడానికి, విజయం సాధించడానికి ఉపవాసం చేశాడంటే విజయ ఏకాదశి ప్రాధాన్యత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
విజయ ఏకాదశి రోజున స్నానం చేస్తే నీటిలో ఉసిరికాయ వేసుకుంటే పుణ్యం పెరుగుతుంది. శ్రీమహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి విజయ ఏకాదశి శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. ఇక విజయ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాస వ్రతాన్ని పూర్తి ఆచారాలతో ఆచరిస్తారో వారు విజయంతో ఆశీర్వదించబడతారు.
చదువులో అయినా, వ్యాపారాలలో పోటీ అయినా, మరి ఏ ఇతర జీవిత లక్ష్యం అయినప్పటికీ విజయ ఏకాదశి రోజు ఉపవాస వ్రతాన్ని ఆచరించేవారు విజయం తప్పక సాధిస్తారు. విజయ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల చేసిన పాపాలు పోయి, పుణ్యం వస్తుంది.. విజయ ఏకాదశి వ్రతం భక్తులకు మోక్షాన్ని కూడా కలిగిస్తుంది. విజయ ఏకాదశి రోజు విష్ణువును పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.అన్ని పనులూ విజయవంతంగా చేయగలుగుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications