ధన జ్యోతిష్యం.. వీరికి అనుకూలం.. మీరున్నారా?

రాశి ఫలాలతోపాటు ధన జ్యోతిష్య ఫలితాలు తెలుసుకోవడానికి ప్రజలు మొగ్గుచూపుతుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా పండితులు వీటిని అంచనా వేస్తుంటారు. ఈరోజు అన్ని రాశులవారికి ధన జ్యోతిష్యం ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి:పెద్ద పెద్ద పనులు చేపడతారు. పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. పనుల్లో విజయాన్ని సాధిస్తారు. గణేషుడికి 11 దూర్వాలను సమర్పించాలి.

వృషభం: కొద్దికాలంగా పూర్తికాకుండా ఉండిపోయిన పని తేలికగా మారుతుంది. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంతోపాటు అందులో విజయం సాధిస్తారు. పాలు కలిపిన నీటి రావిచెట్టుకు పోయాలి.

మిథునం: వ్యాపారంలో ఉన్న టెన్షన్ ఈరోజుతో తొలగిపోతుంది. అనుకున్న పని పూర్తిచేస్తారు. గాయత్రి చాలీసా పఠించాలి.

కర్కాటకం: ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు. వ్యాపారంలో మంచి సంపాదన ఉంటుంది. మీకున్న గౌరవ మర్యాదలను కాపాడుకోవాల్సి ఉంటుంది. విష్ణుమూర్తిని ఆరాధించడంతోపాటు విష్ణవు మంత్రాన్ని పఠించాలి.

today money astrology

సింహ రాశి: వ్యాపారానికి సంబంధించి ప్రయాణిస్తారు. కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. డబ్బును కూడా ఖర్చు చేస్తారు. సూర్య పురాణం పఠించాలి. తండ్రి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి.

కన్య రాశి: రాజకీయాలకు సంబంధించినవారు మంచి అవకాశాన్ని పొందుతారు. ఎవరి మాటల్లో చిక్కుకోకూడదు. విస్తరణ కోసం ఎదురుచూస్తున్న వ్యాపారస్తులకు ఈరోజు చాలా మంచిది. సరస్వతిదేవిని పూజించడంతోపాటు రాహు మంత్రాన్ని పఠించాలి.

తుల: ఆర్థిక విషయాల్లో గందరగోళం తలెత్తుతుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. పని నిలిచిపోతుంది. శివ చాలీసా, శివ మంత్రం పఠించాలి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టిన పెట్టుబడివల్ల నష్టం వస్తుంది. ఆవాల నూనెను రాసిన నానరొట్టెను నల్ల కుక్కకు సమర్పించాలి.

ధనుస్సు: ఆపోజిట్ జెండర్ కు చెందిన స్నేహితులద్వారా వృద్ధి చెందుతారు. శ్రీరామరక్షా స్తోత్రం పఠించాలి. మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించండి.

మకరం: విలువైన వస్తువులు అందుతాయి. అనవసరమైన ఖర్చులుంటాయి. పసుపు చందనం తిలకం పెట్టుకొని గురువు ఆశీస్సులు తీసుకోవాలి.

కుంభం: చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. వ్యాపారం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. శివునికి అభిషేకంతోపాటు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి.

మీనం:కష్టపడినదానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పెట్టుబడిలో లాభం ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+